ఎనర్జిటిక్ హీరో రామ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అని.. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపించింది. రామ్ ని ఇప్పటివరకు చూడని విధంగా ఊర మాస్ క్యారెక్టర్ లో చూపించేందుకు బోయపాటి అదిరిపోయే స్టోరీ రెడీ చేశారని గుసగుసలు వినిపించాయి. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆలోచనలో పడిందనేది వార్తలు వినిపిస్తున్నాయి.
కారణం ఏంటంటే… రామ్ రెమ్యూనరేషన్ 15 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడని టాక్. రామ్ కి 15 కోట్లు అయితే.. బోయపాటికి కూడా 15 కోట్లు ఇవ్వాలి. హీరో, డైరెక్టర్ కే 30 కోట్లు అంటే.. ఇక మిగిలిన నటీనటులు, టాప్ టెక్నీషియన్స్, ప్రమోషన్స్ ఇలా అన్నీ కలిసి 100 కోట్లు అవుతుంది. ఎందుకంటే.. బోయపాటి మేకింగ్ అలా ఉంటుంది మరి. రామ్ తో 100 కోట్లు సినిమా అంటే.. రిస్కే. అందుకనే ఈ ప్రాజెక్ట్ డిష్కసన్ స్టేజ్ లో ఆగిందని సమాచారం.
అయితే.. బోయపాటి, బన్నీ కాంబినేషన్లో మూవీ ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. అలాగే బోయపాటి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మరి.. రామ్, బోయపాటి కాంబినేషన్లో మూవీ ఉంటుందో..? ఉండదో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.











