టాలివుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘క్రాక్‘. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ‘క్రాక్’. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత ఠాగూర్ మధు భావిస్తున్నాడు. అయితే ‘క్రాక్’ సినిమా విడుదల నిలివేసే విధంగా స్టే ఇవ్వాలని తమిళ్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు కోర్టుకెక్కారు. దీనితో ఈ సినిమా లీగల్ చిక్కుల్లో పడింది.
అసలు విషయం ఏమిటంటే ‘క్రాక్’ చిత్ర నిర్మాత అయిన ఠాగూర్ మధు తమిళ్ లో విశాల్ హీరోగా టెంపర్ సినిమాను రీమేక్ చేశాడు. ఆ సినిమా పేరు ‘అయోగ్య’. తమిళ్ లో డిజాస్టర్ గా నిలిచింది. విశాల్ కెరీర్ లోనే అతిపెద్ద పరాజయం అనే చెప్పాలి. స్క్రీన్ సీన్ మీడియా వారు ‘అయోగ్య’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఠాకూర్ మధు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలేదని, తమ బాకీలు తీర్చిన తర్వాతే ఆయన నిర్మిస్తున్న ‘క్రాక్’ సినిమాను విడుదల చేయాలని స్క్రీన్ సీన్ మీడియా వారు కోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడు ఈ ‘క్రాక్’ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు ‘క్రాక్’ సినిమా చాలా ముఖ్యమైనది. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు రవితేజ. ‘క్రాక్’ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన ‘డాన్ శ్రీను’, ‘బలుపు’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాల వల్లే ‘క్రాక్’ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. నిర్మాత ఠాగూర్ మధు లీగల్ చిక్కుల్లో నుండి బయటకు వచ్చి త్వరగా ‘క్రాక్’ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలని వారు కోరుకుంటున్నారు. మరి ఈ కోర్టు గొడవ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
Must Read ;- నక్కిన దర్శకత్వంలోనే మాస్ మహారాజా నెక్స్ట్ మూవీ?