Hero Rohith Coming Back To Movies With A Police Story :
సిక్స్ టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ చిత్రాల్లో హీరోగా నటించిన రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. సిక్స్ టీన్స్ లో దేవుడు వరమందిస్తే పాటకు కొరియోగ్రాఫీ చేసిన డ్యాన్స్ మాస్టర్ దర్శకత్వంలో ఇప్పుడు ఆయన కళాకార్ అనే సినిమాలో నటించారు. ఇందులో ఆయన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఇలాంటి కథలు ఓటీటీల్లో హోరెత్తిస్తున్నాయి. ఓటీటీలో ఏ థ్రిల్లర్ సినిమా చూసినా ఇన్వెస్టిగేషన్ కథాంశంతోనే సాగుతోంది అలాంటప్పుడు రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్ లో పోలీస్ పాత్రను ఎందుకు ఎంచుకొని వుండచ్చు అని విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయినా.. హీరోలు కొంచెం ముదిరాక కేరెక్టర్ ఆర్టిస్టులుగానో లేదా విలన్ గానో నటిస్తుంటారు. కానీ రోహిత్ మాత్రం మళ్లీ హీరోగానే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడైనా స్పీడ్ అందుకుంటాడేమో వేచి చూడాలి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో వున్న థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వచ్చిన రోహిత్ సినిమాను తీసుకోవడానికి ఓటీటీ సంస్థలు ఏ మాత్రం ముందుకొస్తాయో చూడాలి. పూర్తయిన ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ సంస్థల చుట్టూ తిరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి.. ఏ ఓటీటీ సంస్థ అయినా ఈ సినిమాను తీసుకుంటుందో లేదో చూడాలి. సెకకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి సినిమాను ఎంచుకోవడం కరెక్ట్ కాదేమో అంటున్నారు. మరి.. రోహిత్ నిర్ణయం సరైనదేనా..? కాదా..? అనేది ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది.
Must Read ;- క్రైమ్ థ్రిల్లర్ కోరుకునే వారికి ‘ఫోరెన్సిక్’