Hero Sumanth Wedding Card And Marriage News Viral :
హీరో సుమంత్ అక్కినేని జయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. ‘ప్రేమకథ’తో తెలుగు సినిమాకు పరిచయమైన ఆయన ‘స్నేహమంటే ఇదేరా’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కోండ హైస్కూల్’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం సక్సెస్ రేసులో వెనుకపడిపోయారు. ‘మళ్లీ రావా’ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు. త్వరలోనే సుమంత్(Hero Sumanth) రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. తన ఫ్యామిలీకి బాగా తెలిసిన పవిత్ర అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ పెళ్లికార్డు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో హీరోయిన్ కీర్తిరెడ్డి పెళ్లి చేసుకొని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో విడిపోయారు. తాజాగా రెండో పెళ్లి చేసుకొని కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు హీరో సుమంత్.
Must Read ;- తమిళ దర్శకుడితో నటి త్రిష పెళ్లి?











