‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ.. గీత గోవిందం బిగ్గెస్ట్ హిట్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ మూవీ తర్వాత అంతగా హిట్స్ కొట్టలేకపోయినా.. పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు మాత్రం అందుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే స్పోర్ట్ డ్రామాలో నటిస్తున్న విజయ్ .. మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకున్నాడు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే, మరో పక్క పెద్ద కంపెనీలకు బ్రాండింగ్ చేస్తూ.. సత్తా చాటుకుంటున్నాడు.
ఈ క్రమంలో రౌడీ బ్రాండ్ పేరుతో క్లోత్స్ బిజినెస్ కూడా ప్రారంభించి.. విజయవంతంగా నడుపుతోన్న విజయ్.. అదే చేత్తో నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టి.. తొలి ప్రాజెక్ట్ గా కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై .. తరుణ్ భాస్కర్ తో మీతో మాత్రమే చెప్తా అనే మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ మరో రంగంలోకి కూడా అడుగుపెడుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
విజయ్ దేవరకొండ తాజాగా మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా ప్రవేశించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదటి మల్టీప్లెక్స్ గా ఏవీడీ సినిమాస్ ను తన స్వగ్రామమైన మహబూబ్ నగర్ లో ప్రారంభించడానికి రెడీ అయ్యాడు. ఏషియన్ గ్రూప్ తో కలిసి విజయ్ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఏషియన్ విజయ్ దేవరకొండ అనే అర్ధం వచ్చేలా ఏవీడీ అని పేరు పెట్టుకున్నాడు. ఏప్రిల్ 9న విడుదల కానున్న వకీల్ సాబ్ స్ర్కీనింగ్ తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించబోతున్నాడు. మరి ఈ రంగంలో విజయ్ ఏ స్థాయిలో లాభాలు ఆర్జిస్తాడో చూడాలి.
Also Read : ‘లైగర్’ విజయ్ దేవరకొండ తో శివగామి