Heroine Anu Emmanuel Desperately Need A Hit :
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) పేరు ముందువరుసలో కనిపిస్తుంది. నాని హీరోగా చేసిన ‘మజ్ను’ సినిమా ద్వారా ఈ కోలకళ్ల సుందరి పరిచయమైంది. మనసు మైదానంలో మత్తుమందు కుమ్మరించే కళ్లు .. మందుపాత్రలను పేల్చే చూపులు అనూకి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. వంచిన విల్లువంటి పెదాలు .. మంత్రం ఉపయోగించకుండానే మాయచేసే నవ్వు ఆమెకి మాత్రమే సొంతమనిపిస్తాయి. అవి పడుచు గుండెలను వల లేకుండానే పట్టేస్తుంటాయి.
అలాంటి అనూకి కెరియర్ ఆరంభంలో భారీ హిట్లేమీ పడలేదు. కానీ ఆమె అందం .. ఆకర్షణ .. యూత్ లో ఆమెకి పెరుగుతున్న క్రేజ్ .. స్టార్ హీరోల సరసన అవకాశాలను తెచ్చిపెట్టాయి. చాలా తక్కువ సమయంలోనే ఆమె పవన్ కల్యాణ్ (అజ్ఞాతవాసి) అల్లు అర్జున్ (నా పేరు సూర్య) సరసన అవకాశాలను అందుకోగలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమాలు అంతగా ఆడలేదు. ఆ సినిమాలు సక్సెస్ ను సాధించి ఉంటే ఆమె పరిస్థితి వేరేలా ఉండేది. అయితే అప్పటికి కూడా గ్లామర్ పరంగా ఆమెకి దక్కవలసిన మార్కులు దక్కాయి.
ఆ తరువాత కూడా హిట్ ఫార్ములాగా చెప్పుకునే రెండు సినిమాలను ఆమె చేసింది. ఒకటి ‘శైలజా రెడ్డి అల్లుడు’ అయితే, మరొకటి ‘అల్లుడు అదుర్స్‘. ఈ రెండు కథల్లోను యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు అనేకం కనిపిస్తాయి. కానీ ఇవి కూడా ఆమెకి హిట్ ఇచ్చే ధైర్యం చేయలేకపోయాయి. దాంతో సహజంగానే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆమె ‘మహాసముద్రం‘ చేస్తోంది .. ఈ సినిమా హిట్టు ఆమె కెరియర్ కి అత్యవసరం. అజంతా శిల్పం వంటి ఈ అమ్మాయికి ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.
Must Read ;- ఫస్ట్ లుక్ : ‘మహాసముద్రం’ నుంచి మహా బ్యూటీ