హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. సినిమాల మీద సినిమాల్ని లైన్ లో పెట్టే హీరో ఒక్క మాస్ మహారాజా రవితేజ మాత్రమే. కొంతకాలంగా సక్సెస్ రేస్ లో వెనుకబడ్డ రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో .. మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఎప్పటి లాగానే తదుపరి చిత్రాల లైనప్ ను అందరూ ఆశ్చర్యపోయే విధంగా సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ ని ట్రాక్ మీద పెట్టిన రవితేజ .. దీని తర్వాత సినిమాను కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సెట్ చేసుకున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ నక్కిన త్రినాథరావు తో అతడి నెక్స్ట్ మూవీ అప్పుడే లైన్ లోకి వచ్చేసింది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. ఆల్రెడీ ‘ఖిలాడీ’ కోసం మాస్ మహారాజా .. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి అనే కొత్త అమ్మాల్ని ఫిక్స్ చేసుకున్న అతగాడు.. ఇప్పుడు నక్కిన సినిమా కోసం ‘గాలి సంపత్’ బ్యూటీ లవ్లీ సింగ్ ను ఎంపిక చేశాడని సమాచారం. ఇంతకు ముందు రవితేజ నటించిన నేలటిక్కెట్టు లో కూడా మాళవికా శర్మ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఇప్పుడు మళ్లీ రవితేజ కొత్తమ్మాయిలతో తన కెరీర్ ను పరుగులెట్టిస్తున్నాడు. మరి నిజంగానే లవ్లీ సింగ్ రవితేజ , నక్కిన సినిమాలో కథానాయిక గా ఫైనలైజ్ అవుతుందో లేదో చూడాలి.
Must Read ;- రవితేజ 68వ సినిమా ఎనౌన్స్ మెంట్!