కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కథానాయిక మెహ్రీన్. ఫస్ట్ మూవీతోనే సక్సస్ సాధించింది. ఆతర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, కవచం, ఎఫ్ 2, అశ్వథ్ధామ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం వెంకీ – వరుణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఎఫ్ 3 మూవీలో నటిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది.
2016లో కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో మంచి అవకాశాలను దక్కించుకుని ముందుకు వెళుతుంది. ఇలాంటి టైమ్ లో మెహ్రీన్ సడన్ గా మ్యారేజ్ కి ఓకే చెప్పి షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. అయితే.. మెహ్రీన్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అనేది పాత న్యూసే. కొత్త వార్త ఏంటంటే.. ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఎప్పుడంటే.. మార్చి 12న ఎంగేజ్ మెంట్ అని తెలిసింది. కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరగనుంది.
ఇరు కుటుంబాలు ఇప్పటికే బంధువులందరికి ఎంగేజ్మెంట్ డేట్ గురించి సమాచారం ఇచ్చారు. చాలా మంది హీరోయిన్లలాగే ఈ భామ కూడా ఆరేంజ్జ్ మ్యారేజ్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెహ్రీన్ తల్లి ఈ సంబంధాన్ని ఫిక్స్ చేశారట. భవ్య బిష్ణోయ్.. హర్యానాకి చెందిన యువ రాజకీయ నాయకుడు. ఆయన తండ్రి సీనియర్ కాంగ్రెస్ ఎంపీ. మ్యారేజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. మంచి ముహూర్తం చూసి డేట్ నిర్ణయించినున్నారు. అయితే.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా..? లేదా అంటే..? సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని టాక్ వినిపిస్తుంది. నిజమో కాదో తెలియాల్సివుంది. మరి.. మెహ్రీన్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.











