ఈ మధ్య ప్రతి సినిమాలోనూ సిద్ శ్రీరామ్ పాట హైలైట్ గా నిలుస్తోంది. స్టార్ హీరోలు సైతం శ్రీరామ్ గళాన్నే కోరకుంటున్నారు. తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాలోనూ సిద్ శ్రీరామ్ స్వరం హైలైట్ అయ్యింది. తేజు అప్ కమింగ్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నభానటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. నూతన దర్శకుడు సుబ్బు ఈ మూవీతో చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి ‘హే ఇది నేనేనా’ అంటూ సాగే ఓ లవ్లీ మెలోడిని విడుదల చేసింది.
సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్యూన్ చేశాడు, రఘురామ్ లిరిక్స్ అందించాడు. సిద్ శ్రీరామ్ ఈ మధ్య ఏ పాట పాడినా చాట్ బస్టర్ అయిపోతుందనే టాక్ ఉంది. నిజానికి ఈ సింగర్ పాడిన పాటలు కూడా టాప్ లిస్ట్ లో కొనసాగుతన్నాయి, దీంతో ఈ పాటకు కూడా సిద్ శ్రీరామ్ వాయిస్ మెయిన్ ఎస్సెట్ అనే చెప్పాలి. ఆ తరువాత తమన్ ఇచ్చిన ట్యూన్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ టైప్ ట్యూన్స్ తెలుగులో వినిపించలేదు. ఇక లిరిక్స్ కూడా కథకి అనుగుణంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి.
ఈ పాట కంటే ముందు రిలీజ్ చేసిన సోలో బ్రతుకే టైటిల్ సాంగ్ బాగానే జనాల్లోకి వెళ్లినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. అయితే ఆ లోటు ఇప్పుడు రిలీజ్ చేసిన పాట తీర్చేస్తుందనే అనిపిస్తోంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. హీరో సాయితేజ్ కూడా దీనికి ఒప్పకున్నట్లు సమాచారం. ఈ పాట జనంలోకి ఎలా దూసుకెళుతుందో చూడాలి.











