దాచుకోవడం .. ఇదేక్కడ సంస్కృతి..!
‘ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తోంది ..! మరో అనాలోచిత చర్య ఇలా కోర్టు చుట్టూ తిప్పుతూ .. మొట్టికాయలు వేయిస్తోంది.. !!’ ఇది సీఎం జగన్ రెడ్డి కు బాగా వర్తిస్తోంది. ఏపి పాలన పగ్గాలను చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత, ప్రజా వ్యతిరేకత నిర్ణయాలపై వందల సంఖ్యలో వ్యతిరేక తీర్పులను హైకోర్టు వెలువడించింది. ఇదోక ప్రపంచ రికార్డు కూడా! ఎందుకంటే ఈ ప్రపంచంలో వందల సంఖ్యలో ప్రభుత్వం వ్యతిరేక తీర్పులు రావడం జగన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతోంది!
జీవోలను ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు..!
జీవోఐఆర్టీ వెబ్ సైట్ లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని బుధవారం జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. వెబ్సైట్ లో జీవోలను ఉంచకపోవడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరుఫున న్యాయవ్యాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసే జోవోల్లో ఐదు శాతం మాత్రమే వెబ్సైట్ లో ఉంచుతున్నారని, ఇది సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 ఎనిమిదిలకు విరుద్దమని వివరించారు. అయితే టాప్ సీక్రెట్ జీవోలు అప్లోడ్ చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. జీవోలను సీక్రెట్, టాప్ సీక్రెట్ గా ఎలా విభజించి చూస్తారో చెప్పండి అని కోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని జీవోలు వైబ్సైట్లో ఉంచింది.. సీక్రెట్ అంటూ అప్లోడ్ చేయని జీవోల వివరాలను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది!