ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడంలేదంటూ గతంలో ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు సోమవారం విచారించింది. విచారణ అనంతరం మాజీ సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీ రాజ్శాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదిలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో జరిగిన విచారణ సమయంలో.. కోర్టు ఆదేశాలను పట్టనట్లుగా వ్యవహారించడంపై సమాధానం చెప్పడానికి వచ్చే నెల 22న కోర్టుకు హాజరు కావాలని సూచించింది.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించేలా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఈసీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్లు ఈసీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేస్తూ.. ప్రభుత్వం ఈసీకి సహకరించాలని సూచించింది. అయినా కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదంటూ.. ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను వేశారు. ఎస్‌ఈసీ న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. అధికారులు కోర్టుకు స్వయంగా హజరయ్యి ఎందుకు సహకరించలేదో వివరణ ఇవ్వాలని తెలిపింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది.
Must Read ;- అప్పుడు అవార్డు.. ఇప్పుడు అభిశంసన ఎదుర్కొంటున్న ద్వివేది