పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వీడియో తీయాలని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓట్ల లెక్కింపు సమయంలో వీడియో తీయాలని పంచాయతీలో ఒక్క ఓటరు కోరినా వీడియో తీయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.వీడియో రికార్డు చేసే విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు చేయాలని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఎన్నికలు పారదర్శకంగా జరిపించే బాధ్యత ఎస్ఈసీదేనని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై ఈ నెల 13న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేలా ఎన్నికల సంఘం జిల్లా అధికారులను ఆదేశించాలని కృష్ణా జిల్లాకు చెందిన నాంచారయ్య హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు.
కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదు
ఓట్ల లెక్కింపు సమయంలో వీడియో తీయాలని ఈ నెల 13న హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు పట్టించుకోవడం లేదని ఇవాళ నాంచారయ్య హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. పంచాయతీలో ఒట్ల లెక్కింపు ప్రక్రియలో వీడియో తీయాలని ఏ ఒక్క ఓటరు కోరినా వీడియో రికార్డు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది.
Must Read ;- పంచాయతీ దౌర్జన్యాలు..