వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘దిశ ఎన్ కౌంటర్’ చిత్రాన్ని నిలిపి వేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కోర్టుకు పిటీషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కృష్ణ మూర్తి అన్నారు.
‘దిశ ఎన్ కౌంటర్’ చిత్రం లో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు కృష్ణ మూర్తి. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కృష్ణ మూర్తి కోరారు. దిశ సంఘటన పై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతుంటే ఎలా చిత్రం తీస్తారని కృష్ణమూర్తి కోర్టు కు తెలిపారు. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ లకు హైకోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
Must Read ;- వర్మ స్వయంగా ఆవిష్కరించిన ‘వర్మ మన ఖర్మ’!