కన్నడ నటులు నాగభూషణ, సంజనా ఆనంద్ నటించిన ‘హనీమూన్’ వెబ్ సిరీస్ ఈ నెల 27 నుంచి ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానుంది. యూత్ టార్గెట్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఇటీవల ఉద్భవ్, పునర్నవి నటించిన కమిట్ మెంటల్ ను ఇటీవలే విడుదల చేశారు. రెండో ప్రయత్నంగా హనీమూన్ ను విడుదల చేస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా దీన్ని తెరకెక్కించారు. కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ వెళ్లే కథాంశంతో ఇది తెరకెక్కింది. కొత్తదనం ఉన్న కథ కావడంతో బాగా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో దీన్ని విడుదల చేస్తున్నారు.
ఇతర భాషల్లో రూపొందిన వెబ్ సిరీస్ ను తెలుగులోకి అనువదించి ఆహా విడుదల చేస్తోంది. హనీమూన్ ఫస్ట్ లుక్ ను ఆహా విడుదల చేసింది. సక్కత్ స్టూడియో క్రియేటివ్ స్టూడియో దీన్ని రూపొందించింది. ఈ వెబ్ సిరీస్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో నటించిన నాగభూషణ దీనికి మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించారు. దీనికి తేజస్ గణేశ్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ ఆహాలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
Must Read ;- తమ ఆనందానికి హద్దేలేదంటోన్న నవదంపతులు