మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన చిత్రం ఆచార్య. ఇటీవలే సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరు, చెర్రీ కలిసి నటిస్తున్న ఈ చిత్రం పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇక ఈ మూవీలో చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది.. చెర్రీ స్క్రీన్ మీద ఎంతసేపు కనిపించనున్నాడనేది మొదటి నుంచి అందరిలో ఆసక్తిని రేపుతున్న ఒక అంశం. కాగా రాంచరణ్ ఇంటర్వెల్ కి ముందు ఆయన కనిపిస్తాడా? ఆ తరువాత ఎంట్రీ ఇస్తాడా? అనేది మరో ప్రశ్నగా అభిమానుల్లో జరుగుతున్న చర్చ.
అయితే ఈ సినిమాలో చరణ్ ‘సిద్ధ’ పాత్రలో కనిపిస్తుండగా.. ఆ పాత్రను గెస్టుగా చూపించాలని అనుకున్నారట. ఈ క్రమంలో ‘సిద్ధ’ పాత్రను ఓ 15 నిమిషాల పాటు చూపించాలనుకున్నారట దర్శకుడు కొరటాల శివ. కానీ ఆ క్యారెక్టర్ లో మంచి స్టఫ్ ఉండటంతో సమయాన్ని అలా పెంచుతూ వెళ్లారట. అలా 15 నిమిషాలు మాత్రమే అనుకున్న సిద్ధ పాత్ర ఇప్పుడు 45 నిమిషాలకు పెరిగినట్టుగా సమాచారం.
ఇక మూవీలో చరణ్ పాత్ర ఇంటర్వెల్ కి ముందు మొదలై.. ఆ తరువాత కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన నాయికగా బుట్టబొమ్మ పూజ హెగ్డే అలరించనుంది. చిరంజీవి – మణిశర్మ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. ఇక ఆచార్య సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ మంచి తలక సంపాదించుకున్నాయి. కాగా గత సినిమాల మాదిరిగానే ఈ మూవీలోని అదే దారిలో వెళుతుందా అనేది చూడాలి.