పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ తో మూవీ చేస్తున్నారు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కి ఓకే చెప్పి సర్ ఫ్రైజ్ చేసారని చెప్పచ్చు. మలయాళంలో విజయం సాధించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి తెగ నచ్చేసిందట. అందుకనే.. ఈ మూవీ రీమేక్ లో నటించాలనుకున్నారట.
Also Read ;- పవన్ అభిమానులను ఊరిస్తున్న డైరెక్టర్ క్రిష్
సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సంభాషణలు రాస్తుండడం విశేషం. అయితే.. మలయాళం వెర్షెన్ లో రెండు మాంటేజ్ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. మరి.. తెలుగు వెర్షన్ లో కూడా అన్నే పాటలు ఉంటాయా..? అంటే.. మరిన్ని పాటలు ఉంటాయని తెలిసింది. ముందుగా ఈ సినిమాని కూడా పాటల లేకుండానే తీయాలి అనుకున్నారట. అయితే.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులు పాటలు ఎక్స్ పెక్ట్ చేస్తారు.
అలాంటిది పాటలు లేకుండా సినిమా అంటే.. వాళ్లు డిజ్పాయింట్ అవుతారు. అదీ కాకుండా.. పాటలు పెడితే రెండు కోట్లు రైట్స్ రూపంలో వస్తుంది. అందుచేత మూడు లేదా నాలుగు పాటలు పెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమా సంగీత దర్శకత్వ బాధ్యతను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కి అప్పగించారు. తమన్ ఆల్రెడీ రెండు ట్యూన్లు రెడీ చేసారు. ఆ రెండు ట్యూన్లు పట్టుకుని చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నారట తమన్. ఈ వారం హైదరాబాద్ లోనే ఉండి ట్యూన్స్ ఫైనల్ చేయించుకుంటారని తెలిసింది.
ఈ మూవీని జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. వకీల్ సాబ్ ఉగాదికి వస్తే.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సమ్మర్ కి వస్తుంది. ఒకవేళ వకీల్ సాబ్ సమ్మర్ కి వస్తే.. ఈ మూవీ సమ్మర్ తర్వాత రిలీజ్ చేస్తారని సమాచారం.
Must Read ;- ప్రభాస్ వెర్సెస్ పవన్.. బాక్సాఫీస్ ను షేక్ చేసేది ఎవరు..?