దేశవ్యాప్తంగా టీకా పంపిణీ చేయడానికి ప్రభుత్వ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యాక్సిన్ సీసాలకు, సూదులకు ఆర్డర్లు ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాదు, వ్యాక్సిన్ అందించడానికి అన్ని సన్నహాలను త్వరితగతిన పూర్తి చేయమని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఎవరికీ నిర్భంధం కాదని కూడా ప్రకటించినా.. టీకా వేసుకుంటే అది మీతో పాటు మీ కుటుంబానికి మేలని చెప్తున్నారు డాక్టర్లు. మరి ప్రభుత్వం అందించే టీకా పొందాలంటే ఎలా? అసలు టీకా నమోదు ఎలా చేసుకోవాలి? దానికి అర్హతలు ఏమిటి? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటికన్నింటికీ సమాధానాలు చూద్దాం.
ముందుగా అర్హతలు ఏమిటో తెలుసుకుందాం..
తొలి దశలో ముందుగా డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, 50 ఏళ్లు పై బడిన వారికి, అందునా 60 ఏళ్ల వాళ్లకి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణియించింది. వీరితో పాటు వయస్సుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక జబ్బుల (షుగర్, రక్తపోటు) తో బాధపడుతున్న వారు అర్హులు. మొదటి దశ కింద దాదాపు 30 కోట్లమందికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కోటి మంది డాక్టర్లు, 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ (పొలీస్, సెక్కురిటీ, మున్సిపల్ వర్కర్స్, ప్రమాద సమయంలో పనిచేసే వాలంటీర్లు), ఇక మిగిలిన 27 కోట్ల మందిలో 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పేరు నమోదు చేసుకోవడం ఎలా?
టీకా పొందాలంటే పేరు నమోదు చేసుకోవడం ఎలా అనే విషయం చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. టీకా కోసం పేరు నమోదు చేసుకోవడానికి కంటే ముందు ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడం అవసరం. ఎందుకంటే.. టీకా కోసం మీరు పేరు నమోదు చేసుకున్నా కూడా ప్రభుత్వం మీ పేరును ఓటరు లిస్ట్‌తోనే సరిపోల్చిన తర్వాతే నిర్ధారించబోతుంది. ఇప్పుడు పేరు నమోదు ఎలాగో చూడండి. అందుకోసం ముందుగా ‘CO-WIN’ అనే యాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవాలి. అందులో మీ పేరు నమోదు సమయంలో ఏదైనా గుర్తింపు కార్డు ద్వారా నమోదు చేయాలి. (ఆధార్, పాన్, రేషన్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు).
ఎలా ఎంపిక చేస్తారు?
డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను విషయంలో పూర్తి సమాచారాన్ని ప్రభుత్వ సిద్ధం చేస్తుంది. ఇక మిగిలిన 27 కోట్ల టీకాలను మామూలు ప్రజలను ఎంపిక చేసే విషయంలో వారి వయస్సు, వారి ఆరోగ్య స్ధితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వయస్సును నిర్ధారించడానికి ఓటరు లిస్ట్‌లోని పేరును ప్రామాణికంగా భావిస్తుంది. ఇక వ్యాధి విషయంలో మెడికల్ రిపోర్ట్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క విషయాన్న పరిశీలించిన మీదట ఎంపిక చేసిన వారి మొబైల్‌కి ప్రభుత్వం సమాచామిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా టీకా వేయించుకోవాలనేది తెలియజేస్తుంది. దాని ప్రకారం మీరు సంబంధించిన హాస్పిటల్ లేదా ప్రభుత్వ కార్యలయంకి వెళ్లి టీకాను అందుకుంటే సరిపోతుంది.
Also Read: ఫైజర్ మరో ముందడుగు.. భారత్ బయోటెక్ వైపే అందరి చూపు..