సినిమాలకే పరిమితమైన స్టార్ హీరో చిన్న తెర వైపు మొగ్గు చూపాడంటే అతని ఇమేజ్ పడిపోయి అయినా ఉండాలి లేదా పెద్ద తరకు కష్టకాలం వచ్చి అయినా ఉండాలి. పెద్ద తెరకు కష్టకాలం వచ్చినంత మాత్రాన తమ స్థాయిని తగ్గించుకుంటారా? అవును అది కూడా నిజమే. ఇదంతా ఎవరి గురించి అంటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి. అతను ఓ వెబ్ సిరీస్ చేయడానికి అంగీకరించాడట. అతను దీన్ని అంగీరించడానికి కారణం బహుశా పారితోషికం అయి ఉంటుంది. ఎందుకంటే ఇందులో నటించినందుకు ఆయనకు లభించే పారితోషికం అక్షరాలా రూ. 90 కోట్లు. కేవలం ఓ వెబ్ సిరీస్ కోసం ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చేది ఎవరబ్బా అనే సందేహం కూడా కలగక మానదు.
ఈ డిజిటల్ యుగంలో బిజినెస్ మామూలుగా జరగడం లేదు. ఈ కారణంగానే వెండి తెర హీరోలు కూడా దిగిరాక తప్పడం లేదు. ఈ కరోనా కాలంలో ఇది కూడా ఓ మంచి పరిణామమే అనుకోవాలి. అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, అజయ్ దేవగణ్ సరసన ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా చేరిపోయినట్టే. వీరంతా ఓటీటీ సినిమాలకు ఓకే చెప్పేస్తున్నారు. ఈ హీరోలు ముందుకు రావడంతో వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు పెద్ద నిర్మాణ సంస్థలెన్నో ముందుకొస్తున్నాయి.
Must Read: ఓటీటీ అవార్డుల వైపు ఫిల్మ్ ఫేర్ చూపు
తాజా సమాచారం ఏమిటంటే హృతిక్ రోషన్ హీరోగా ఓ సంస్థ కోట్ల రూపాయల వ్యయంతో భారీ యాక్షన్ కింగ్ దర్శకత్వం లో అక్కినేని హీరో?వెబ్ సిరీస్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. మొత్తం ఆరు ఎపిసోడ్ లుగా ఇది ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్ లోనూ యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తారని అంటున్నారు. దీనికి హృతిక్ అందుకోబోయే పారితోషికం రూ.90 కోట్లు. వెబ్ సిరీస్ కోసం ఇంత రెమ్యూనరేషన్ మాత్రం ఓ రికార్డుగానే చెప్పాలి. ఇందులో హృతిక్ సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ‘తక్కలి సదం’ వండిన అక్కినేని కోడలు











