ఆంధ్రప్రదేశ్ కి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. కృష్ణపట్నం సిటీ (క్రిస్ సిటీ) పేరుతో ఇది ఏర్పాటు కానుంది. దీన్ని రాష్ట్రంలోని తొలి గ్రీన్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా భావిస్తున్నారు. ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్) ద్వారా ఈ భారీ ప్రాజెక్టు క్రిస్ సిటీ ఏర్పాటు అవుతుంది. ఫలితంగా కృష్ణపట్నంలో లక్షపైగా ఉద్యోగాలు ఈ క్రిస్ సిటీ ద్వారా రానున్నాయి. త్వరలో నే ఈ భారీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 20న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.
నిజానికి ఈ ప్రాజెక్టు ఏపీకి ఎప్పుడో రావాల్సింది. 2014-19మధ్యనే ముందుకు వెళ్లిన ఈ ప్రాజెక్ట్ సైకో దెబ్బకి మూలన పడింది. చంద్రబాబు ముందు అధికారం లో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టును పట్టాలకు ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలో ప్రభుత్వం మారిపోయి సైకో జగన్ చేతికి పాలన పగ్గాలు అందడంతో పెట్టుబడులు కుంటుపడగా.. ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితికి తెచ్చారు. ఆ క్రమంలోనే క్రిస్ సిటీ ప్రాజెక్ట్ కూడా మూలన పడింది. ఈ ప్రాజెక్టుకు తొలుత చంద్రబాబు అనుమతులు తీసుకురాగా.. తర్వాత జగన్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడమే మానేసింది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్ట్ లో కదలిక ఏర్పడి.. అతి త్వరలోనే శంకుస్థాపనకు నోచుకుంటోంది.
చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు అవుతోంది. దీన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపడుతున్నారు. సెమికండక్టర్ ల తయారీ రంగానికి భవిష్యత్తు బాగున్నందున ఈ సెమికండక్టర్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. దీనితో పాటు మరో 25000 కోట్లతో ఆంధ్ర(6), బీహార్ లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవలే కేంద్రవర్గాలు తెలిపాయి. వీటికి ఈ వారంలో జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది.
క్రిస్ సిటీ ప్రాజెక్ట్ ని దాదాపు 11,000ఎకరాలకు పైగా భూమిలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ సంస్థలు ప్రణాళిక కూడా రూపొందించాయి. తొలి దశలో 2134 ఎకరాల్లో మౌలిక వసతులను కల్పించనున్నారు. ఇందుకు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుండగా.. ఈ ప్రతిపాదనలకి కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రం భూమిని సమకూర్చితే ఈ నిధులు కేంద్రం నుంచి వస్తాయి. తొలిదశలో చేపట్టే ఈ మౌలిక సదుపాయాల ద్వారానే దాదాపు రూ.20 కోట్ల దాకా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రాజెక్టులు ఇలా వాయు వేగంతో పట్టాలకు ఎక్కుతుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది