ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సంధ్యారాణి. హైదరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్. డబ్బుపై వ్యామోహమో.. లేక పురుషులంటే ధ్వేషమో.. కారణాలు ఏమైతేనేం నిత్యపెళ్లికూతురిగా అవతారమెత్తింది. ధనవంతులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దించుతోంది. మెల్లగా పరిచయం పెంచుకొని మంచి అమ్మాయిలా మెలుగుతుంది. చనువుగా మెలగడంతో సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లు. ఆ సమయంలో గడిపిన ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజేది. లేదంటే కేసు పెడతానని బెదిరించేది. ఇలా ఇప్పటివరకు సంధ్యరాణి ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అందులో ఇద్దరికి విడాకులు ఇచ్చింది. ఆమె వేధింపుల కారణంగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు.
నాలుగో పెళ్లి.. ఆపై వేధింపులు
ఆ తర్వాత కొన్నాళ్లకు షాబాద్ కు చెందిన చరణ్ అనే యువకుడితో ప్రేమయాణం కొనసాగించింది. సినిమాలు, షికార్లకు తిప్పింది. ఫొటోలను అడ్డంపెట్టుకొని రహస్యంగా పెళ్లి చేసుకుంది. లక్షలు వసూలు చేసి, నరకం చూపించింది. అంతటితో ఆగక.. ఒక గదిలో బంధించింది. సదరు యువకుడు వాట్సాప్ ద్వారా శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంధ్యారాణిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. సంధ్యారాణి ప్రవర్తనపై అంతకముందే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా… ఎలాంటి మార్పు రాలేదు.
Must Read ;- ఆయనకు ఇద్దరు : ఒకే ముహూర్తానికి ఇద్దరికి తాళి కట్టాడు.. పెళ్లి వేడుక వైరల్











