నగరంలో వరదలను బీజేపీ తనకు అనుకూలంగా వాడుకునే పనిలో పడింది. వరదలతో నగరం కోలుకుంటున్న వేళ బీజేపీ సీనియర్ నేతలు ప్రజలకు అండగా ఉండేందుకు రంగంలోకి దిగారు. నగరంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ తామున్నామన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మొత్తం రంగంలోకి దిగి క్షేత్ర స్థాయి పర్యటనలుచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆలసత్వంతోనే ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నుండి జాతీయ ఉపాధ్యక్షురాలు వరకు అంతా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గ్రేటర్ లో పార్టీల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. వరదలే ప్రధానాస్త్రంగా పార్టీలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నాయి. నాయకులు పోటీ పడి మరీ ముంపు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి తోచిన సాయం చేస్తున్నాయి. వరద ముంపుతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని సమీక్షలు చేస్తే సరిపోదని క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి జరిగిన నష్టంపై అంచనా వేయాలని సూచిస్తున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావ్ ఇలా అంతా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటున్నారు నేతలు. టీఆర్ఎస్ సర్కార్ చేసిన వాగ్దానాలేంటి.. ప్రస్తుతం ఏం జరుగుతన్నదేంటి అంటూ ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు . ఇప్పటికే చిర్రెత్తుకొచ్చి కోపం మీద ఉన్న ప్రజలు ఎవరు వచ్చినా విడిచి పెట్టడం లేదు. అధికార పార్టీ నేతలపై తిరగబడినంత పని చేస్తున్నారు. ఇదే తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్న బీజేపీ తమ కార్యకర్తలను యాక్టీవ్ చేసే పనిలో పడింది.
ఏదైనా మంచి జరిగితే తనగొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ నేతలు , ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ సాయం కావాలన్నా చేస్తుందని.. కానీటీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే పని పెట్టుకుని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తోందని చెబుతున్నారు. నగరంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న భూ కబ్జాల తోనే నగరం ముంపునకు గురైందని.. గతంలో ఎన్నడూ లేని విధంగా కాలనీలు ముంపునకు గురయ్యాయని విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వం పై వస్తున్న ఆగ్రహానికి తోడు తాము కూడా ప్రజలకు సేవ చేస్తామన్న నమ్మకాన్ని కలిగిస్తే ఈజీగా ఈ గ్రేటర్ ఎన్నికల్లో గట్టెక్క వచ్చని భావిస్తున్నారు బీజేపీ నేతలు. అందుకే ఒకేసారి ముఖ్యనేతలందరూ గ్రేటర్ హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఒకే రోజు 20కి పైగా వరద ప్రాంతాలకు వెళ్తున్నారు.. ఒకరు కొత్త సిటీలో పరామర్శిస్తుంటే మరోకరు ఓల్డ్ సిటీపై దృషి సారించారు. నగరంలో బీజేపీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది.. మేయర్ పీఠంపై పాగావేయాలని చూస్తున్న ఆ పార్టీకి ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సీఎంగా లోకేష్‌కి ప్రమోషన్… యువనేత పుట్టినరోజు చంద్రబాబు సంచలన కామెంట్స్…!!
గతకొద్ది రోజులుగా ఏపీలో లోకేష్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్నా, మొన్నటి వరకు...