కరోనా విరామం తరువాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక్కటే వరుసగా టోర్నీలను నిర్వహిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు ఇంగ్లాండ్ లో పర్యటించారు. తాజాగా ఆస్ట్రేలియా జట్టు కూడా ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది. కరోనా నియమాల ప్రకారం ముందుగా ఆసీస్ ఆటగాళ్లు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉన్నారు. మూడు సార్లు పరీక్షలు జరిపి వారిని బయో బబుల్ లోకి అనుమతించారు. ముందుగా ఆసీస్ జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను ఇంగ్లాండ్ తో ఆడింది. ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో సొంతం చేసుకొంది. బట్లర్ ను ఇంగ్లాండ్ జట్టు ప్రమోట్ చేసి ఓపెనర్ గా పంపడం సత్పలితాలను ఇచ్చింది. ఇదే సమయంలో వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలన్ అద్భుతంగా రాణించారు.
బట్లర్, డేవిడ్ మలన్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు అలవోకగా ఈ సిరీస్ ను గెలుపొందింది. సుదీర్ఘ విరామం తరువాత జరిగిన ఈ సిరీస్ ముగియగానే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాకింగ్స్ ను ప్రకటించింది. ఈ సిరీస్ లో ఓడిపోయినా ఆసీస్ జట్టు 275 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాను ఒకసారి చూస్తే
1) ఆస్ట్రేలియా (275)
2) ఇంగ్లాండ్ (271)
3) ఇండియా (266)
4) పాకిస్థాన్ (261)
5) సౌత్ ఆఫ్రికా (258)
6) న్యూజిలాండ్ (242)
7) శ్రీలంక (230)
8) బంగ్లాదేశ్ (229)
9) వెస్ట్ ఇండీస్ (229)
10) ఆఫ్గనిస్తాన్ (228)
ఆసీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన డేవిడ్ మలన్ నాలుగు స్థానాలు ఎగబాకి మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న పాక్ ఆటగాడు బాబర్ అజమ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న టీమిండియా ఆటగాడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాకింగ్స్ జాబితాను చూస్తే
1) డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్)
2) బాబర్ అజామ్ (పాకిస్థాన్)
3) ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
4) రాహుల్ (ఇండియా)
5) మన్రో (కివీస్)
6) మాక్స్వెల్ (ఆసీస్)
7) హాజరుతుల్లా జాజాయ్ (ఆఫ్గనిస్తాన్)
8) లెవీస్ (విండీస్)
9) కోహ్లీ (ఇండియా)
10) మోర్గాన్ (ఇంగ్లాండ్)
బౌలింగ్ విషయానికి వస్తే ఆఫ్గనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో కూడా అదే దేశానికి చెందిన ముజీబ్ రెహమాన్ ఉన్నారు.
1) రషీద్ ఖాన్ (ఆఫ్గనిస్తాన్)
2) ముజీబ్ రెహమాన్ (ఆఫ్గనిస్తాన్)
3) అగార్ (ఆసీస్)
4) షాంసి (సౌత్ ఆఫ్రికా)
5) ఆడమ్ జాంపా (ఆసీస్)
6) సన్తనేర్ (కివీస్)
7) రషీద్ (ఇంగ్లాండ్)
8) ఇమాద్ వాసిం (పాకిస్థాన్)
9) షాదాబ్ ఖాన్ ( పాకిస్థాన్)
10) రిచర్డ్సన్ (ఆసీస్)
ఆల్ రౌండర్ జాబితాను కూడా ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఈ జాబితాలో ఐసీసీ టాప్ 5 ఆటగాళ్ల పేర్లనే ప్రకటించింది.
1) మహమ్మద్ నబీ ( ఆఫ్గనిస్తాన్)
2) మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)
3) విలియమ్స్ (జింబాబ్వే)
4) బెర్రింగ్టన్ (స్కాట్లాండ్)
5) డెలనీ (ఐర్లాండ్)