వైసీపీలో ఐడ్రీమ్ చిచ్చు రగులుస్తోందా ? ఐడ్రీమ్ ధాటికి వైఎస్ అభిమానులు వైసీపీకి దూరమవుతున్నారా ? ప్రశ్నించే వారిపై ఐ డ్రీమ్ చేస్తున్నది ఏమిటి ? ఏకపక్ష నిర్ణయాలంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఐ డ్రీమ్ ఏం చేస్తోంది ?
వైసీపీలో ఐ డ్రీమ్ చిచ్చు పెట్టిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తమను ప్రశ్నించే వారిని తప్పించే కుట్రలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జగన్ వెంట నడవాలనుకున్న వైఎస్ అభిమానులు ఐడ్రీమ్ ధాటికి వైసీపీకి దూరమవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
నిజానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం మొదలైన మొదట్లో వైఎస్ అభిమానులు ఎంతో అభిమానంతో జగన్ వెంట ఎటువంటి షరతులు లేకుండా నడిచారట.అంతేకాకుండా వారిలో చాలామంది ఏమీ ఆశించకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి సోషల్ మీడియాలో ఫేక్, మార్ఫింగ్ పోస్టులుపెట్టి ఎన్నో కేసులు కూడా ఎదుర్కొన్నారు.
ఇదే సంధర్భంలో అప్పుడే జగన్ ,ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ల కలయిక చోటుచేసుకోవడంతో వైసీపీలో పేటియం బ్యాచుల ప్రాధాన్యత ఎక్కువైపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే వైసీపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా విభాగం కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు.అందులో ఎక్కువ భాగం సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న వీరాభిమానులే ఎక్కువగా ఉన్నారట. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే వారందరినీ దూరం పెట్టారని టాక్.
ఇదంతటికీ వైసీపీలో కీలక వ్యక్తిగా చెప్పుకోబడే విజయసాయి రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలే కారణమనే చర్చ అప్పట్లో జరిగిందట. వీరు చేస్తున్న ఆకృత్యాలను, తీసుకనే నిర్ణయాలను ప్రశ్నించే వారిని కక్షపూరితంగా సోషల్ మీడియా విభాగానికి దూరం పెట్టేవారట. అందులో భాగంగానే ఎంతో కీలకంగా కొండా రాజశేఖర్‌రెడ్డి, ఇప్పల రవీంద్రరెడ్డి లు వైసీపీకి దూరమయ్యారనేది ఓ చర్చ. అదేసమయంలో విజయసాయి రెడ్డి అండ్ కో దౌర్జన్యాలను తట్టుకోలేక ఇతర సోషల్‌మీడియా ఇంచార్జ్ లు సైతం సోషల్ మీడియాని పూర్తిగా వదిలేశారట.
ఇదిలా ఉంటే అప్పుడే డిజిటల్ కారోపరేషన్ లో పాగా వేసిన ఐ డ్రీమ్ చిన్నాల వాసుదేవరెడ్డి తన టీంనంతా రంగంలోకి దింపారట.వస్తూనే విజయసాయిరెడ్డి అండ్ కొ కంటే ఎక్కువగా ఐ డ్రీమ్ గ్యాంగే వైసీపీలో అసలైన అభిమానులందరినీ ఏరిపారేసిందట.దీంతో శివ రాచర్ల ఆధ్వర్యంలోని సోషల్ మీడియా టీం ఐడ్రీమ్‌లో కీలకంగా మారిందని కొందరు చర్చించుకుంటున్నారట. అయితే ఈ అంశం పై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న ఇప్పల రవీంద్రరెడ్డి “ఐడ్రీమ్ లెక్కలు, బొక్కలు” తేలుస్తానంటూ చేసిన పోస్టు పెను దుమారమే లేపిందట. దీంతో ఇప్పల రవీంద్ర పేజీ సోషల్ మీడియా నుంచి క్షణాల్లో మాయం అయిపోయిందట.మరోవైపు ఐడ్రీమ్ టీంని ఎవరు వేలెత్తి చూపినావారిపై కోవర్టు ముద్రవేసి బయటకి పంపేస్తున్నారట అక్కడి పెద్దలు.
వాస్తవానికి ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి మొదట జనసేన టికెట్ కోసం ట్రై చేశారు.అంతేకాకుండా ఆయనకు కొన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి.అయితే వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి స్వప్రయోజనాల కోసం వాసుదేవరెడ్డి వైసీపీపంచన చేరి అక్కడ కీలకం అయ్యారని టాక్. అదేసమయంలో చాపకిందనీరులా మారి వైఎస్ అభిమానులు, జగన్ సైకో ఫ్యాన్స్‌ని సైతం పక్కన పెట్టేలా ఐ డ్రీమ్ టీం ద్వారా వ్యూహం అమలు చేశారని కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే ఐడ్రీమ్ కుట్రలతో ఇప్పుడు వైసీపీలో కేవలం ఒక్క పేటీఎం బ్యాచులు మాత్రమే మిగిలాయట. ఐడ్రీమ్ టీంని గౌరవించినంత కాలమే వాటికి మనుగడ అనే చర్చ అంతర్గతంగా జరుగుతోందట. దీంతో జగన్ నుంచి వందల కోట్లు ప్యాకేజీ తీసుకుని వైసీపీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియాలో ఐడ్రీమ్ టీం, విజయసాయిరెడ్డి టీం, వైఎస్ ఫ్యామిలీ వీరాభిమానులుగా పిలువబడే టీంలతో పాటు పేటీయం బ్యాచ్ నాలుగు గ్రూపులుగా తయారయ్యాయట. వారి మధ్య నెలకొంటున్న కూడా గొడవలు తీవ్రమయ్యాయని సమాచారం. అవికాస్త రోజుకి రోజుకి పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక విజయసాయిరెడ్డి తల పట్టుకుంటున్నాడని సొంత పార్టీ నేతలె చర్చించుకుంటున్నారట.
మొత్తం మీద వైసీపీ సోషల్ మీడియాలో ఐడ్రీమ్ రగిల్చిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడ్మ లేదు. నమ్ముకున్న వారిని పక్కన పెడుతున్నా పట్టించుకోకుండా కుట్రలు , కుతంత్రాలు చేసే వారిని అక్కున చేర్చుకున్న జగన్ కి ఐడ్రీమ్ రూపంలో కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని ఇంతకాలం వైఎస్ ని చూసి జగన్ వెంట నడిచిన వైఎస్ అభిమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట.
Must Read:-సిక్కోలు వైసీపీ ఉన్మాదంపై చంద్రబాబు ఫైర్! కోన వెంకట్రావుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే?











