ఏపీలో ప్రశ్నిస్తే కేసులు.., నిలదీస్తే అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇదేక్కడి సంప్రదాయామో కానీ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమౌతుందనే చెప్పాలి.
జగన్ రెడ్డి పాలనలో ఏపీలో కేసులు.. అక్రమ అరెస్టు వంటివి ప్రజలు నిత్యం చూస్తున్నదే. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ప్రజలపై సీఐడీతో కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తున్నారు. ప్రభుత్వ వైఫ్యలాలను.., అవినీతిని నిలదీస్తే విపక్షాలపై అక్రమ కేసులు కట్టించి కటకటాల పాలు చేయడం నిత్యకృత్యమైంది. మీడియాలో నిత్యం చూసే వార్తలు ప్రధానంగా వినిపించేవి రెండే రెండు వార్తలు.. అవి ఒకటి అక్రమ కేసుల్లో ప్రతిపక్ష నేతలు అరెస్ట్ లు.., మరోకటి రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న జనం..ఈ వార్తలు చూడకుండా ఏపీలో రోజు కంప్లీట్ కావడం లేదు అన్నది వాస్తవం.
ఏపిలో పాలన గాడి తప్పి నాలుగేళ్ళైంది. తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరెస్ట్ భాగోతానికి తెరతీస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. నిన్న కడప జిల్లా పులివెందులలో తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి అరెస్ట్ అప్రజాస్వామికం అని తెలిసినా.. పోలీసు బాస్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేయక తప్పని పరిస్ధితి అయ్యింది. 10 నెలల క్రితం జరిగిన సంఘటనను నేడు తెరపైకి తీసుకొచ్చి.. అరెస్ట్ చేయడంతోపాటు.. ఆధారాలు లేని క్రికెట్ బెట్టింగ్ కేసు మరోకటి చేర్చి రవిపై నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు బనాయించారు.
మరోవైపు టిడ్కో ఇళ్లల్లో అక్రమాలు జరిగాయని పెద్దఎత్తున డిమాండ్ చేస్తూ.. పాలకొల్లులో నిరసన వ్యక్తం చేస్తున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు రోడ్డుపై ఈడ్చూకెళ్లి అరెస్ట్ చేసి వాహనంలో తీసుకెళ్లారు. ఇంతటి దారుణంగా అధికారాన్ని చెలాయిస్తూ.. ఉక్కుపాదం మోపుతుంటే.. న్యాయపోరాటం తప్పా వేరే దిక్కుతోచని స్ధితిలో ప్రజాస్వామ్యం, విపక్షం ఉన్నదన్నది వాస్తవం.
ఎన్నికల సమయంలో విపక్ష నేతల వరుస అరెస్టులతో రాజకీయంగా నష్టపోతోంది వైసీపీనే అని తెలిసినా.. జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న మొండి వైఖరికి ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.