ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి ఎంతటి విస్త్రతంగా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ నంది అవార్డులపై ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల వేదిక, తెలంగాణ సీఎం రేవంత్ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.. పక్కరాష్ట్రం కూడా అవార్డులని ప్రకటిస్తే, కళాకారులను గౌరవించినట్లుంటుందని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.. వీటిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. కొందరు చిరంజీవిని టార్గెట్ చేశారు.. మరికొందరు, ఆయన కామెంట్స్ కరెక్టే అని వాదించారు..
మెగాస్టార్ వ్యాఖ్యలపై రియాక్షన్ ఎలా ఉన్నా, సీఎంగా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని ఇవి మరింత పెంచాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాలీవుడ్ పెద్దలని ఇంటికి పిలిపించి అవమానించారనే ఆరోపణలు ఉన్నాయి.. వారి వెహికిల్స్‌ని దూరంగా నిలిపి అరకిలోమీటరుపైగా నడిపించారని చెబుతారు. వయసులో జగన్ కంటే ఎంతో పెద్దవాడయిన చిరంజీవిని… చేతులెత్తి నమస్కారం పెట్టేలా చేశారని ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు.. చిరంజీవి నమస్కారం చేసే విజువల్స్ వ్యూహాత్మకంగారిలీజ్ చేశారని ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు అభిప్రాయం.. దీని వెనుక జగన్ గ్రాఫ్, ఇమేజ్ పెంచడం అనే కుట్ర ఉందనేది మరికొందరి మాట.. ఇక టాలీవుడ్‌లోని కొందరు సెలెక్టివ్ హీరోల సినిమాల రిలీజ్, టికెట్ రేట్ల పెంపు విషయంలో జగన్ కక్షపూరితంగా వ్యవహరించారనే వాదన ఉంది..
ఆ అయిదేళ్లు టాలీవుడ్ హీరోలలో చాలా మంది సఫోకేషన్‌కి గురి అయ్యారు. అందుకే, జగన్‌ని నంది అవార్డుల పురస్కారాలు ఇవ్వాలని తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రపోజల్ వినిపించలేదని గుర్తు చేస్తున్నారు..
తాజాగా, చంద్రబాబు సర్కార్ రావడంతో ఇండస్ట్రీకి అంతా సాఫీగా జరుగుతోంది.. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ లాంటి పెద్దలు తమ అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడిస్తున్నారు.. బాబు సర్కార్ నుండి ఏం ఆశిస్తున్నారో ఓపెన్‌గా అడుగుతున్నారు.. వారి ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు.. జగన్ హయాంలో ఈ స్వేచ్చ ఉండేది కాదు.. చంద్రబాబు పాలనపై చిన్న కామెంట్ చేసినందుకు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో ఓపెన్ సీక్రెట్… తనపై నెగిటివ్ కామెంట్స్ చేసినా చంద్రబాబు ప్రజాస్వామ్య యుతంగా తీసుకుంటారు.. అందుకే, చిరంజీవి కామెంట్స్‌పై టీడీపీ నుండి ఎలాంటి కౌంటర్ రాలేదు. నంది అవార్డుల అంశంపై పరిశీలిస్తున్నామని, త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఏపీ సినీమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా ప్రకటించారు.. ఈ స్వేచ్చ, స్వాతంత్ర్యం జగన్ టీమ్‌కి నచ్చదు.. అదే చంద్రబాబుకి, జగన్‌కి తేడా.. అందుకే, చంద్రబాబు గ్రేట్ అని, రేవంత్ సాక్షిగా మరోసారి ప్రూవ్ చేశారు మెగాస్టార్‌అని ఇండస్ట్రీ పెద్దలు చర్చించుకుంటున్నారు..











