కరోనా కేసులు భారీగా పెరుతుండటం, టీకాను వినియోగించుకునేవాళ్ల సంఖ్య పైపైకి వెళ్తుండటంతో కరోనా వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి. వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో మరో టీకా దేశంలోకి రాబోతోంది. రష్యా తయారీ స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పై నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) సిఫారసులను పరిశీలించిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. భారత్ లో ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్లు భారత్ లోనే ఉత్పత్తవుతున్నాయి. మూడో వ్యాక్సిన్ గా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రాబోతోంది. రష్యాలో తయారైన ఈ టీకాను ఇప్పటికే పలు దేశాల్లో వినియోగిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
Must Read ;- తగ్గేది లే.. కొత్తగా 1.69 లక్షల కరోనా కేసులు