భారత మాజీ క్రికెట్ దిగ్గజం, భారతదేశానికి మొట్టమొదటి ప్రపంచ కప్ ను అందించిన సారథి కపిల్ దేవ్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోఫ్లాస్టీ చేసిన సంగతి కూడా తెలిసిందే.
ప్రస్తుతం ఆయన కొంచెం కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
కపిల్ కు గుండెపోటు అని తెలిసిన వెంటనే ఎందరో క్రికెట్ ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు పెద్ద ఎత్తున కపిల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు.
‘నేను బాగానే ఉన్నాను.. నా త్వరగా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి
కృతజ‍్క్షతలు, త్వరలోనే ఇంటికి చేరుకుంటాను’ అంటూ తన ట్విటర్ ఖాతాలో ఉంచారు.
— Kapil Dev (@therealkapildev) October 23, 2020