టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి సోగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో సంచలన విజయం సాధించడంతో దీనికి ప్రీక్వెల్ చేయాలని నాగ్ ఫిక్స్ అయ్యారు. గత కొంతకాలంగా కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు కానీ.. ఇప్పటి వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ స్క్రిప్ట్ లో మరో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. జయప్రద అని టాక్ వినిపిస్తోంది. ఆమె క్యారెక్టర్ సినిమాలో కీలకం అంటున్నారు. మొదట నాగ్ – చైతు కలయికలో ఈ సినిమా రానుందని వార్తలు వచ్చాయి కానీ చైతు ఈ సినిమాలో జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తాడట. చైతు కొడుకు పాత్రలో అక్కినేని అఖిల్ కనిపిస్తాడని, అంటే ఈ సినిమా మొత్తం బంగార్రాజు అతని మనవడు అఖిల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం.
అంటే నాగ్ – అఖిల్ కలయికలో తాత మనవళ్లుగా ఈ సినిమా రాబోతుందని సమాచారం. ఈ క్రేజీ మూవీ ఎప్పుడో మొదలవ్వాలి కానీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈసారి అన్ని అడ్డంకులను దాటుకుని సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. మరి.. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం వలే ప్రీక్వెల్ బంగార్రాజు కూడా సంచలనం సృష్టిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- వైష్ణవ్ తేజ్ కి నాగ్ అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా.?