కన్ను కొట్టి విధానంలో తన దైన స్టయిల్ చూపి అవకాశాలు కొట్టేసిన భామగా ప్రియా ప్రకాశ్ వారియర్ అందరికీ తెలుసు. ఈ భామ తాజాగా తేజ సజ్జా హీరోగా నటించిన ‘ఇష్క్’లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వచ్చేవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ ముచ్చట్లు తెలుసుకుందాం.
* నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత నేను చేసిన సెకండ్ స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఇష్క్` . నాట్ ఏ లవ్‌స్టోరీ అనేది దీనికి ట్యాగ్‌లైన్. ఓ కొత్త సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందింది. సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎగ్జైట్ మెంట్ సినిమా చూస్తున్నంత సేపూ ఉంటుంది. ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే సినిమా ఇది.
* ఇందులో అనసూయ అనే పల్లెటూరి అమ్మాయిగా నటించాను. తను ఆత్మాభిమానం ఉన్నా అమ్మాయి. ‘చెక్’లో నా స్క్రీన్ ప్రజెన్స్ టైమ్ తక్కువ.. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్.
* తేజ సజ్జా మంచి కో స్టార్. నా ఏజ్‌గ్రూప్‌తో సరిపోయే హీరో. సో.. సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. తెలుగు డైలాగులు చెప్పడంలో నేను కాస్త ఇబ్బంది పడ్డప్పుడు తను నాకు బాగా హెల్ప్ చేశాడు.
* దర్శకుడిగా ఎస్.ఎస్. రాజు గారికి ఇది మొదటి సినిమా. అయినా చాలా కాన్‌సన్‌ట్రేషన్ తో చేశారు. క్యారెక్టర్ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేయమని చెప్పి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మేజర్‌గా నైట్ షూట్స్ చేయాల్సి వచ్చింది.
* కొంతగ్యాప్ తర్వాత మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ చేసిన తెలుగు సినిమా ఇది. ఈ ఆఫర్ నాకు అనుకోకుండా వచ్చింది. ఇలాంటి మంచి బ్యానర్‌లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్ అవుతుందని వెంటనే `ఇష్క్` సెట్ కు వచ్చేశాను.
* ఇది ఓ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్. ఆ సినిమా బేస్ లైన్ నాకు బాగా నచ్చింది. కథ బాగా కుదరిందనుకున్నా. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేశారు.
* తెలుగు డైలాగ్స్‌లో పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఇష్క్ చేసేప్పుడు టీమ్ నాకు హెల్ప్ చేశారు. ముందురోజే డైలాగ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసి సెట్స్‌కు వచ్చేదాన్ని.
* మలయాళంలో నేను నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదలై రెండేళ్లయ్యింది. ఈ ఏడాది చెక్, ఇష్క్ లతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
* ఫెయిల్యూర్స్ నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు వైవిధ్యంగానే అనిపించాయి. ఇష్క్‌లో నేను చేసిన అనసూయ పాత్ర లో మంచి డెప్త్ ఉంటుంది.
* సందీప్‌కిషన్ నెక్ట్స్ మూవీలో నేను ఓ కీలక పాత్ర చేస్తున్నా. ఆ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయి. ఆ వివరాలు త్వరలోనే చెబుతా.
Must Read ; రీమేక్ అని ప్రకటించడానికి అభ్యంతరం ఏంటి? కారణం అదేనా?











