ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలయింది.. దేశంలో ప్రస్తుతం పొలిటికల్ సెమీ ఫైనల్స్ జరుగుతున్నాయి.. అయిదు రాష్ట్రాల ఎన్నికలతో రాజకీయ వేడి మొదలయింది.. చలి కాలం ప్రారంభం అవుతున్నా.. ఎన్నికల వేడి రాజకీయ నేతలను చెమటలు కక్కిస్తోంది.. ఈ అయిదు రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీ, ఒడిశాలాంటి రాష్ట్రాలు సైతం అలెర్ట్ అయ్యాయి. తాజాగా ఏపీలోని అధికార పార్టీ తన పని తీరుపై పలు సర్వేలు చేయించుకుంటోంది.. ముఖ్యంగా ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తోన్న ప్రశాంత్ కిశోర్ లేటెస్ట్ సర్వే ఒకటి చేశారని ప్రచారం జరుగుతోంది.. ఈ సర్వే ఫలితం ఇదే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనే అంశం లెక్కలతో సహా పోస్ట్ అయింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది..
టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే ఈ కూటమికి ఏకంగా 144 స్థానాలు దక్కుతాయని, ఇటు వైసీపీ కేవలం 31 నియోజకవర్గాలకే పరిమితం అవుతుందని సర్వే ఇచ్చిందట.. నాలుగేళ్ల సంక్షేమ పథకాలు కూడా జగన్‌ని కాపాడలేకపోతున్నాయని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పాడని తెలుస్తోంది.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి పడకవేయడం, కనీసం రాజధాని ఏదో తేల్చుకోలేని స్థితిలో ప్రజలు డైలమాలో పడడం, పోలవరం ఆడిపోవడం లాంటి అంశాలు జగన్‌కి శాపంగా మారాయని పీకే తన సర్వేలో తేల్చి చెప్పాడని తెలుస్తోంది.. ఇటు, చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కూడా వైసీపీ అవకాశాలను తీవ్రంగా దెబ్బ కొట్టిందని ఈ సర్వేలో లెక్కలతో సహా వివరించాడట ప్రశాంత్ కిశోర్..
గతుకుల రోడ్డులో పడిన ఏపీని రిపేర్ చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులయిన ముఖ్యమంత్రి అయితేనే బెటర్ అనే భావన ప్రజలలో ఏర్పడిందని ఈ సర్వేలో తేలిందట. ఇటు, రాజధానిపై జగన్ నాలుగేళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా వైసీపీ పుట్టి ముంచనుందని భావిస్తున్నారట ఏపీ ప్రజలు.. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి యూ టర్న్ తీసుకున్న జగన్‌పై ఉద్యోగులు ఆవేశంతో రగిలిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.. వారి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి..
ఇలా అన్ని రంగాలు కుదేలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. దీంతో, ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ప్రశాంత్ కిషోర్ సర్వే తేల్చిందట.. అందుకే, వైసీపీ 31 స్థానాలకే పరిమితం అవుతుందని లెక్కలు ఇచ్చిందట.. ఈ సర్వే సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో జగన్ టీమ్ హై అలెర్ట్ అయిందని సమాచారం.. మరి, దీని నుండి గట్టెక్కడానికి జగన్ మరోసారి ఎవరిని జైలుకు పంపుతాడో అని సెటైర్లు వేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు..