ఈ ఏడాది ఐపీఎల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అత్యంత పేలవంగా ప్రారంభించింది. అయితే ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థాయిలో ఉంది. మరోవైపు ముంబైదీ అదే కథ. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లోనే విజయాలు సాధించింది. అయితే రన్‌రేట్ మెరుగ్గా ఉండడం వల్ల పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానం దక్కించుకుంది.
బెంగళూరు, కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన హైదరాబాద్ టీమ్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ఢిల్లీ, చెన్నై టీమ్‌లను ఓడించింది. ఇక, చెన్నై చేతిలో ఓటమితో టోర్నీని ఆరంభించిన ముంబై రెండో మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించింది. మూడో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో బెంగళూరు చేతిలో ఓడి నాలుగో మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించింది. సమాన విజయాలు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ముంబై టీమ్ తొలి స్థానంలోనూ, హైదరాబాద్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ రెండు టీమ్‌ల మధ్య ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది.
ముంబై టీమ్ బలాలు
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై టీమ్ ఈ టోర్నీలోనే బలమైన టీమ్. రోహిత్ శర్మ, డికాక్, పోలార్డ్, పాండ్యా వంటి అంతర్జాతీయ స్థాయి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వీరికి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ నుంచి అద్భుత సహకారం అందుతోంది. దీంతో ముంబై బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనబడుతోంది. ఇక, బౌలింగ్ విభాగంలో ముంబై టీమ్ నెంబర్ వన్ అని చెప్పవచ్చు. బుమ్రా, ప్యాటిన్సన్, బుమ్రా వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నారు. కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్ కూడా బంతితో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు.
బలహీనతలు
టీమ్‌లో చాలా మంది స్టార్లు ఉన్నప్పటికీ సమష్టి ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నారు. రోహిత్‌పైనే ఎక్కువగా టీమ్ ఆధారపడుతోంది. బుమ్రా, ప్యాటిన్సన్ వంటి క్లాస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఆల్‌రౌండర్ పోలార్డ్ పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. బౌల్ట్ వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు నియంత్రించడంలో విఫలమవుతున్నాడు. డికాక్ ఫామ్ ముంబై శిబిరంలో ఆందోళన నెలకొల్పుతోంది.
ముంబై టీమ్ (అంచనా)
డికాక్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ప్యాటిన్సన్, చాహర్, బౌల్ట్, బుమ్రా.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బలాలు
ఆరంభంలో తడబడినప్పటికీ తర్వాత హైదరాబాద్ జట్టు పుంజుకున్న తీరు అద్భుతం. ఢిల్లీ, చెన్నై వంటి టీమ్‌లను ఓడించి హైదరాబాద్ టీమ్ రేసులోకి వచ్చింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నైను అద్భుతంగా కట్టడి చేశారు. ఆలౌట్ చేయకపోయినా 164 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నటరాజన్, భువీ కూడా చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ పరుగులు నియంత్రిస్తున్నారు. ఇక, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విలియమ్సన్ చేరికతో హైదరాబాద్ మిడిలార్డర్ బలపడింది. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్ వంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌తో బ్యాటింగ్ విభాగం బలంగా కనబడుతోంది.
బలహీనతలు
నికార్సయిన ఆల్‌రౌండర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. 5, 6 స్థానాల్లో వేగంగా బ్యాటింగ్ చేసే హార్డ్ హిట్టర్లు లేకపోవడం వల్ల హైదరాబాద్ భారీ స్కోర్లు సాధించలేకపోతోంది. ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ త్వరగా ఫామ్‌లోకి రావాలి. ముంబైతో మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారనుంది. పవర్‌ఫుల్ హిట్టర్లతో నిండిన ముంబై ఎటాక్‌ను హైదరాబాద్ బౌలర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
హైదరాబాద్ జట్టు (అంచనా)
వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, నటరాజన్, ఖలీల్ అహ్మద్.
మ్యాచ్ ఫేవరెట్
ఆదివారం మధ్యాహ్నం జరుగబోయే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కంటే ముంబై టీమ్‌కు విజయావకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్టార్ ఆటగాళ్లతో కూడిన ముంబై టీమ్‌ను ఓడించడం హైదరాబాద్‌కు సవాలే. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబైని ఓడించగలిగితే హైదరాబాద్ కాన్ఫిడెన్స్ మరో స్థాయిలో ఉంటుంది.











