ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్‌పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరో 3 వారాలు పొడిగించింది. అవినీతికి పాల్పడ్డానంటూ తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు రెండు వారాల కిందట హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కేసును విచారించిన ధర్మాసనం రెండు వారాల పాటు ఏబీవీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్ వేసేందుకు ఏసీబీ ధర్మాసనాన్ని రెండు వారాల సమయం కోరింది. దీంతో ఏబీవీపై 3 వారాలు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏబీవీ ఆరోపణ
అవినీతి కేసులో తనను అరెస్టు చేసి 48 గంటలు జైల్లో పెట్టడం ద్వారా తనను ఉద్యోగం నుంచి తొలగించాలని చూస్తున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. తన అరెస్టును అడ్డుకోవాలని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
Must Read ;- ప్రభుత్వం వేధిస్తున్నదంటూ సీనియర్ ఐపీఎస్ లేఖ