ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’ కు .. అనసూయ, రష్మీల అంద చందాలే ప్రత్యేక ఆకర్షణ. కళ్ళు చెదిరే గ్లామర్ తో కనికట్టు చేసే ఆ ఇద్దరిలోనూ.. రష్మికి మాత్రమే ఇంకా పెళ్లి కాలేదు. ఈ షో ప్రారంభించి అప్పుడే ఏడేళ్ళపోతున్నా.. రష్మి ఇంతవరకూ పెళ్ళి మాట తల పెట్టకపోవడం.. ఆశ్చర్యమే. సుడిగాలి సుధీర్ కి, రష్మికి మధ్య ఏదో ఉందని, ఆ ఇద్దరూ త్వరలో పెళ్ళిచేసుకుంటారని ప్రేక్షకులు భావిస్తూ వచ్చారు . అయితే అది కేవలం స్కిట్ లో భాగంగా ఆడియన్స్ ను నవ్వించే ఉద్దేశంతోనే అని.. చాలా సార్లు ప్రూవ్ అయింది. దానికి తోడు.. వీరిద్దరూ ఒక స్కిట్ లో ఏకంగా భారీ ఎత్తున పెళ్ళే చేసేసుకున్నారు. ఇప్పుడు మరోసారి రష్మి పెళ్ళి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె త్వరలోనే ఒక బిజినెస్ మేన్ ను పెళ్ళి చేసుకోబోతోందట.
తాజా గా యాంకర్ రవి.. రష్మి పెళ్ళిపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడంతో అమ్మడి పెళ్ళికి ఇంకా ఎన్నో రోజులు పట్టదని జనం అనుకుంటున్నారు. ఇటీవల రాకింగ్ రాకేష్ స్కిట్ లో భాగంగా రవి.. దువ్వాడ రవి అనే గెటప్ తో ఎంట్రీ ఇచ్చాడు. స్కిట్ లో భాగంగా అతడు రష్మితో ఏవమ్మా.. అరవై ఏళ్ళు వచ్చాకా పెళ్ళి చేసుకుంటావా? మరీ షష్ఠి పూర్తి సమయంలో శుభకార్యం అంటే బాగోదేమో .. అని అడుగుతూ.. ఏంటీ ప్రాబ్లెమ్ ? వాడు ఒప్పుకోవడం లేదా? కాదు నువ్వే ఒప్పుకోవడం లేదట కదా.. ఒప్పేసుకో రాదూ.. ఆ శుభకార్యమేదో నేనే జరిపిస్తా. అంటూ పంచ్ పేల్చాడు.
దాంతో రష్మి బుగ్గలు సిగ్గుల మొగ్గలైపోయాయి. సిగ్గు పడుతున్నావంటే.. శుభకార్యం చాలా దగ్గరలోనే ఉందన్నమాట. అంటూ మరో డైలాగ్ పేల్చాడు. దాంతో అది స్కిట్ లో భాగంగా లేదని, ఎలాగూ ఫిక్స్ అయిపోయింది కదా అని ఆమెను అడుగుతున్నట్టుందని, అందుకని నిజంగానే రష్మి పెళ్ళి చేసుకోబోతోందేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు జనం. ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.











