రియా అనే ఓ తీగను లాగితే ఇప్పుడు బాలీవుడ్ డొంక అంతా కదులుతోంది. అసలు బాలీవుడ్ లో ఏం జరుగుతోంది? సినిమా అనే ప్రపంచం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం ఏమిటి? అది ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొటొక్కటిగా బయటికి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాక అతని ప్రియురాలు రియాను పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆమె అనేక విషయాలను బయటపెట్టింది. అవన్నీ అలా ఉంటే అసలు బాలీవుడ్ లో ఏంజరుగుతోందనే విషయంలో హీరోయిన్ కంగనా రనౌత్ అనేక సంచలన విషయాలను బయటపెడుతోంది.
సుశాంత్ మృతి కేసులో ఈ నటి మొదటి నుంచీ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు గుప్పిస్తోంది. తాజా రియా వ్యవహారం డ్రగ్స్ తో ముడిపడి ఉన్నట్లు దర్యాప్తులో వెలుగు చసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా కంగన స్పందించింది. ఓ జాతీయ వార్తా ఛానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చెప్పిన వాటిలో చాలా సంచలన విషయాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో డ్రగ్స్ ను చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటాడట. ఆ కారణంగానే ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. తన భార్యకు కూడా అతను విడాకులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ హీరోతో తను కూడా డేటింగ్ చేసినట్లు కంగన బయటపెట్టింది.
ఆ హీరో కుటుంబ సభ్యులు తనను ఇబ్బింది పెట్టినట్లు ఆరోపించింది. తనకు గురువైన ఓ వ్యక్తి తనకు కూడా డ్రగ్స్ అలావాటు చేశాడని కంగన పేర్కొంది. బాలీవుడ్ లో దాదాపు 95 శాతం మందికి డ్రగ్స్ అలవాటు ఉందట. పోలీసులు ఈ దిశగా విచారణ చేపడితే చాలా మంది సినీ ప్రముఖులు జైలులో ఉంటారని కూడా ఈమె ఆరోపించింది. సినిమా రంగం అంటేనే కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో ఏంచేయాలో తెలియదు. దాంతో అన్ని వ్యసనాలకూ బానిసలవుతుంటారు. పగలు నటిస్తే, రాత్రుళ్లు మత్తులో జోగుతుంటారు. ఒక సారి డ్రగ్స్ కు బానిసగా మారితే చేయించాల్సిన దారుణాలన్నిటినీ అదే చేయిస్తుంది.
సుశాంత్ కేసులో ముఖ్యంగా ఇదే జరిగినట్లు సమాచారం. పైగా అతని అకౌంట్ లోని డబ్బంతా చేతులు మారిపోతూ వచ్చింది. రియా వాట్సాప్ ఛాట్ పరిశీలించిన అధికారులకు డ్రగ్స్ కు సంబంధించి అనేక విషయాలు తెలిశాయి. రియాకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు బహిర్గతమైంది. డ్రగ్స్ సరఫరా చేసే గౌరవ ఆర్యతో పాటు మరికొందరితో కూడా ఈమెకు 2017 నుంచి సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అత్యంత శక్తిమంతమైన, ప్రమాదకరమైన డ్రగ్స్‌గా పిలిచే మిథిలీన్ డయాక్సీ మెథాంఫేటమిన్ గురించి రియా వాళ్లను అడిగినట్టుగా వాట్సాప్ ఛాట్ ఆధారంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.










