ఒక సూపర్ హిట్ సినిమా టైటిల్ కొంతకాలం తర్వాత మరో సినిమాకి పెట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా మెగాస్టార్ సినిమా ల టైటిల్స్ 20 పైన రిపీటయ్యాయి. అయితే వాటిలో సక్సెస్ శాతం బాగా తక్కువ. ‘శ్రీ రస్తు – శుభమస్తు’ 80వ దశకంలో చిరంజీవి, సరిత కలిసి నటించిన సినిమా. కట్టా సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో ప్లాప్ అయింది. అయితే అల్లు శిరీష్ తో పరశురామ్ తీసిన సినిమాకి ఇదే టైటిల్ రిపీట్ చేస్తే హిట్. అలాగే తమిళ హీరో కార్తీ వరుసగా తన రెండు డబ్బింగ్ సినిమాలకు ‘ ఖైదీ ‘, ‘దొంగ’ అని పేరు పెట్టారు. ఖైదీ ట్రెండ్ సెట్టర్ కాగా ‘ దొంగ ‘ నిరాశ పరిచింది.
చిరంజీవితో విజయ బాపినీడు చేసిన ‘ మగ ధీరుడు’ సినిమా టైటిల్ నుంచే రాజమౌళి ‘ మగధీర ‘ టైటిల్ పెట్టారు. ” రాక్షసుడు ” 1986లో వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ” రాక్షసుడు ” కి అదే టైటిల్ రిపీట్ చేశారు. అఫ్ కోర్స్ దాని తమిళ్ ఒరిజినల్ చిత్రానికి అదే టైటిల్ అనుకోండి. చిరంజీవి టైటిల్స్ లో రిపీట్ అయి సక్సెస్ అయిన టైటిల్స్ ఇవే.
‘పున్నమి నాగు ” టైటిల్ ను ముమైత్ ఖాన్ సినిమాకి పెడితే ఆ సినిమా అడ్రెస్ గల్లంతు. 47 రోజులు ‘ అని ఈ మధ్య ఓటీటీలో డైరెక్ గా రిలీజైన సత్య దేవ్ సినిమా పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. బాలచందర్ చిరంజీవితో తీసిన ఒరిజినల్ 47 రోజులు కూడా ఫెయిల్యూర్ సినిమాయే. హీరో టైటిల్ తో నితిన్ తో నాగబాబు బావమరిది మన్యం రమేష్ నిర్మించారు.
పులి టైటిల్ ను విజయ్ డబ్బింగ్ సినిమాకి పెట్టారు. గ్యాంగ్ లీడర్ పేరును నాని – విక్రమ్ కుమార్ సినిమాకి వాడారు. విజేత టైటిల్ స్వయానా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా కి పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక ‘ బి ల్లా – రంగా ” ,’ మగ మహారాజు ‘ , ” రోషగాడు” , ‘ యముడికి మొగుడు ” , ‘ సంఘర్షణ ” , ” స్టేట్ రౌడీ ” టైటిల్స్ తో వచ్చిన ఇప్పటి సినిమాలు పరాజయం పాలయ్యాయి . కార్తీతో ‘ ఖైదీ ‘ తీసిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు విజయ్ తో ” మాస్టర్” అని తమిళ సినిమా తీస్తున్నాడు. తెలుగు లో డబ్ చేసినప్పుడు టైటిల్ ఏం పెడతారో వేరే చెప్పాలా. అయినా కథని బట్టి సినిమాలు ఆడతాయి తప్ప టైటిల్స్ వల్ల కాదు. కేవలం సినిమా టైటిల్ జనాన్ని థియేటర్ కి రప్పించండానికి తప్ప కూర్చోపెట్టడానికి పనికి రాదు.











