చలనచిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఉపేంద్ర. కేవలం నటుడిగానే కాదు కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా ఇలా దాదాపు అన్ని విభాగాలలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఈ స్టార్.దర్శకుడిగా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగారు ఉపేంద్ర.
సీనియర్ స్టార్ హీరోగా తన జోరును కొనసాగిస్తున్న ఆయన.. ఈ మధ్య కాలంలో అటు కన్నడ, ఇటు తెలుగు బాషలలోకేరక్టర్ ఆర్టిస్టుగా కూడా కీలకపాత్రలను చేస్తూ వస్తున్నారు. అలాంటి ఉపేంద్రను మహేశ్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టుగా ఒక వార్త బలంగా వినిపిస్తోంది.
తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి. అతడు, ఖలేజ తర్వాత చాలా ఏళ్లకి మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ మవవీ రాబోతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారని సమాచారం.కాగా, మహేశ్ తండ్రి పాత్ర కోసం ఉపేంద్రను ఎంపిక చేశారనే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
వాస్తవానికి మూవీలో మహేష్ తండ్రి పాత్ర చాలా కీలకమైనదిగానూ.. పవర్ఫుల్ గానూ ఉంటుందని , ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర బలమైనదిగా ఉంటుందని టాక్. గతంలో త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్ర పోషించిన దేవరాజ్ పాత్ర ఆ సినిమాకి హైలైట్ గా నిలవడమే కాక.. ఆయనకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది.ఇక మహేష్ సినిమాలోని ఈ పాత్ర కూడా అదే రేంజ్ లో ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి మహేష్ మూవీలో ఉపేంద్ర కనిపించబోతున్నారా ? ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది.. మాటల మాంత్రికుడు ఈ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారో తెలియాలంటే వేచి చూడాలి మరి..