హారర్ సినిమా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడ హావభావాలే ప్రధానం. ఇప్పటిదాకా లవ్, యాక్షన్ డ్రామాలకే పరిమితమైన చైతు కొత్త జోనర్ లోకి అడుపెట్టడంతో ప్ర్యత్యేక జాగ్రత్తలు తప్పదు. నాగార్జున స్టార్ హీరో అయ్యాడు కానీ తన వారసులు మాత్రం అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. దీంతో చైతూ కెరీర్ ని సమంత చేతికి, అఖిల్ కెరీర్ ని సుప్రియ చేతికి అప్పగించాడట నాగ్. సమంత, చైతూల పెళ్లైన దగ్గర నుంచి చైతూ కెరీర్ ని మొత్తం సమంత డిజైన్ చేస్తుందనే టాక్ నడుస్తోంది.
ఈ వార్తలకి తగ్గట్లుగానే సమంత కూడా చైతూని సినిమాలతో పాటు వివిధ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా తీసుకునేలా సిఫార్సులు చేసింది. మనోడికి ఓఇమేజ్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సమంత కష్టానికి తగ్గట్లుగానే చైతూకి ఓ మినిమమ్ గ్యారంటీ హీరో అనే ఇమేజ్ వచ్చింది. సినిమా ట్రేడ్ వర్గాలు చైతూతో సినిమా చేస్తే లాభం చేసుకోవచ్చనే నిర్ణయానికి ఇప్పడిప్పుడే వస్తున్నాయి. డిజిటిల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అంటూ చైతూతో సినిమా చేస్తే నాన్ థియేట్రికల్ బిజినెస్ తో సేవ్ అవ్వచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే చైతూకి మాస్ ఇమేజ్ లేకపోవడంతో థియేట్రికల్ బిజినెస్ లో మాత్రం చైతూ పెద్దగా నెంబర్స్ చూపించలేకపోతున్నాడు.
దీనికి తోడు మాస్ ఇమేజ్ ని పెంచుకోవడానికి కూడా చైతూ ఎలాంటి ట్రైల్స్ వేయడం లేదు. చైతూ అప్ కమింగ్ సినిమాలు కూడా కేవలం ఏ సెక్షన్ ఆడియెన్స్ దృష్టిల్లో పెట్టుకుని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. పైగా మనోడుకి నటనలో కూడా పెద్దగా ప్రావిణ్యం లేకపోవం పెద్ద మైనస్. ప్రస్తుతం చైతూ విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడని టాక్. ఈ సినిమా హారర్ జానర్ లో తెరకెక్కుతుందంటున్నారు, హారర్ సినిమా అంటే క్లోజ్ అప్ షాట్స్, ఐ ఎక్స్ ప్రెషన్స్ ఎక్కువుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాల్లో చైతూ వెరీ పూర్, మరి విక్రమ్ కుమార్ చైతూ నుంచి ఎక్స్ ప్రెషన్స్ ఎలా రాబట్టుకుంటాడో అన్నది మిలియన్ డాలర్స్ క్వశ్చిన్.











