నిన్నటితరం కథానాయకులలో రాజశేఖర్ స్థానం ప్రత్యేకం. యాక్షన్ హీరోగానూ .. ఫ్యామిలీ హీరోగాను ఆయన తన సత్తా చాటుకున్నారు. అలాంటి రాజశేఖర్ .. కాలంతో పాటు పరుగులు తీయడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ సినిమాకి ముందుగానీ .. ఆ తరువాత గాని ఆయనకి హిట్ పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన బాలకృష్ణ కొత్త సినిమాలో విలన్ గా చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజశేఖర్, ఒక దశలో విలన్ గా టర్న్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తన స్థాయికి తగిన విలన్ పాత్రలను చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను ఆయన కొన్ని ఇంటర్వ్యూల ద్వారా ఇచ్చారు. బలమైన కథాకథనాలు కలిగిన సినిమాల్లో, స్టార్ హీరోలతో తలపడే పవర్ఫుల్ విలన్ పాత్రలు చేయాలనే ఆసక్తితో ఉన్నట్టుగా చెప్పారు. అప్పటి నుంచి కొన్ని సినిమాల్లో విలన్ గా రాజశేఖర్ చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో అవి కార్యరూపం దాల్చలేదు.
తాజాగా బాలకృష్ణ – బోయపాటి సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేసే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం మాత్రం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది. పవర్ ఫుల్ విలన్ రోల్ కోసమే రాజశేఖర్ ను తీసుకోనున్నారని అంటున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఆల్రెడీ ఒక భారీ షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. మరో షెడ్యూల్ షూటింగుకి వెళ్లడానికి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికలుగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి .. కానీ ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. త్వరలోనే హీరోయిన్ ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు తెలుస్తోంది.
AlsoRead ;- బాలయ్య – బోయపాటి సినిమాలో మరో మలయాళ బ్యూటీ?,
AlaoRead ;- కరోనా అంతానికి నందమూరి బాలయ్య మంత్రం!