ఏపీలో టీడీపీ నేతలపై సీఐడీ దాడులు చూస్తుంటే కొన్ని గుర్తొస్తున్నాయి. ముందు చంద్రబాబుకు 23న రావాలని నోటీసు ఇచ్చారు. తర్వాత నారాయణకు 22న రావాలని చెప్పారు. అంటే 22న నారాయణను అరెస్టు చేసి.. 23న చంద్రబాబును అరెస్ట్ చేయాలనేది ప్లాన్‌గా చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. అప్పట్లో సీబీఐ సరిగ్గా ఇలాగే ముందు అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేసి.. తర్వాత జగన్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసుకు ఈ కేసుకు పోలికే లేకపోయినా.. జగన్ తన ఇగో సాటిస్‌ఫై చేసుకోవడానికి.. పగ చల్లార్చుకోవడానికి సరిగ్గా అలాగే ప్లాన్ చేశారని అంటున్నారు.
కేసు వాస్తవానికి కోర్టుల్లో నిలబడదంటున్నా..
చంద్రబాబుపై పెట్టిన కేసు వాస్తవానికి కోర్టుల్లో నిలబడదనే న్యాయవాదులు చెబుతున్నారు. అయితే అధికారాన్ని ఉపయోగించి విచారణ పేరుతో.. అరెస్ట్ చేసి జైలులో కొన్నిరోజులు ఉంచినా.. చాలనేది జగన్ కోరిక. తాను జైలుకెళ్లి ఏం అనుభవించానో.. చంద్రబాబు కూడా అనుభవించాలనేది బలమైన కోరిక. చంద్రబాబు లాంటి నేత జైలు కెళితే.. టీడీపీ కేడర్ నిరాశలోకి వెళ్లిపోతారని.. తెలుగుదేశం వీక్ అయిపోతుందనేది వారి అంచనా. అటు చంద్రబాబును జైలుకు పంపించి హ్యాపీ ఫీలవచ్చు.. ఇటు ప్రతిపక్షాన్ని వీక్ చేసేయొచ్చు.. ఒక దెబ్బకు రెండు పిట్టలనే ప్లాన్‌లో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
కోర్టు ఏం చెబుతుందో..
ఇప్పుడు హైకోర్టులో టీడీపీ వేసే పిటిషన్‌కు ఎలాంటి స్పందన వస్తుంది.. కోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు అసలు విచారణలో ఏం జరుగుతుందో చూద్దాం.. ఇప్పటికి ఎంక్వయిరీయే కదా.. ఈ స్టేజ్‌లో అసలు కేసే వద్దని ఎలా చెబుతాం అని అంటే మాత్రం… అరెస్టుకు రంగం సిద్ధం అయినట్లే. ఆ తర్వాత ఎలాగోలా రిమాండ్‌కు పంపించగలిగితే.. బెయిల్ రావడానికి పది పదిహేను రోజులు పడితే.. అది చాలు జగన్‌కి .. హ్యాపీ ఫీలవడానికి. నేనే కాదు.. బాబు నువ్వు కూడా జైలుకెళ్లావని చెప్పొచ్చు.
రాజకీయంగా ఉపయోగకరమేనా..
టీడీపీ శిబిరం మాత్రం ఇవన్నీ చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచుతాయని.. జగన్ జైలుకెళ్లాడు.. పదేళ్లు కష్టాలు పడ్డాడని జనం ఎలా సానుభూతి చూపించారో.. అంతకు మించి చంద్రబాబుకు సానుభూతి వస్తుందని.. ఈ పరిణామాలన్నీ బాధాకరమైనా.. రాజకీయంగా ఉపయోగకరమేనని భావిస్తోంది. వైసీపీలోని కొందరు నేతలు కూడా ఇదే వర్రీలో ఉన్నారు. ఒకవైపు స్థానిక ఎన్నికల్లో వన్ సైడ్ రిజల్ట్స్ వచ్చాక.. ఇంకా ఈ అనవసరమైన హైడ్రామాలు ఎందుకని.. ఇవన్నీ టీడీపీకే ఫేవర్ చేస్తాయని.. వారంతా టెన్షన్ పడుతున్నారు. జగన్ మాత్రం తాననుకున్న రూటులో.. వేగంగా వెళ్లిపోతున్నారు.
Also Read :వివేకా వర్ధంతికి జగన్ దూరం.. సీబీఐ విచారణే కారణమా..?