ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆక్రమాస్తుల కేసుల విచారణ మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది.తెలంగాణ హైకోర్టు తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు చూస్తే ఇదే జరిగేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 55 మంది జిల్లా మరియు సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తవులు జారీ చేసింది. వారిలో సిబిఐ స్పెషల్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జీ బి.ఆర్. మధుసూధన రావు కూడా ఉన్నారు. గడిచిని మూడు, నాలుగు సంవత్సరాలుగా సీబీఐ కోర్టు బాధ్యతలు నిర్వహిస్తున్న మధుసూధన రావు జగన్ అక్రమాస్తుల కేసులో అనేకమార్లు వాదనలు కూడా విన్నారు. కాగా ప్రస్తుతం ఆయన స్థానంలో సీహెచ్ రమేష్ బాబు సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జిగా బాధ్యతలు తీసుకోనున్నారు.ప్రస్తుతం రమేష్ బాబు కామారెడ్డి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసుల విచారణ ఈబదిలీలతో మళ్ళీ మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు డిశ్చార్జి పిటిషన్‌ల దశ కూడా దాటలేదు. మళ్లీ మొదటి నుంచి వాదనలు మొదలైతే ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.