మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ విడుదల మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే కాగా మరోసారి పోస్ట్ పోన్ చేసిన వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 17 చిత్రం విడుదల చేస్తామని చిత్రి నిర్మాతలు తెలిపినా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మరింత ఆలస్యం అవుతుందని తెలిస్తుంది.
రామారావు ఆన్ డ్యూటీ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఆతర్వాత ఏఫ్రిల్ 25 కు వాయిదా వేశారు.అయితే అదే సమయం లో పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకుల మందుకు రావడం తో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాయిదా వేశారు. ఆతర్వాత వేసవి సెలవుల్లో చిత్రాన్ని విడుదల చేస్తారని రవితేజ అభిమానులు, ప్రేక్షకులు ఆశించారు,కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం గా ఈ చిత్ర విడుదల మరింత ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీలో సమాచారం..
బిగ్ స్క్రీన్ పైకి బెస్ట్ అండ్ భారీ అవుట్ పుట్ ని తీసుకురావడానికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి అదనపు కేర్ తీసుకోవడం కూడా ప్రధాన కారణని సమాచారం. అయితే యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న రామరావు ఆన్ డ్యూటీ రవితేజ కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్ – సీనియర్ నరేష్ – పవిత్ర లోకేష్ – ‘సర్పట్ట’ జాన్ విజయ్ – చైతన్య కృష్ణ తనికెళ్ల భరణి రాహుల్ రామకృష్ణ ఈ చిత్రం నటిస్తున్నారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించారు..