అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంతోనే కుర్రకారు మతిపోగొట్టేసి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన బ్యూటీ సమంత. వీరిద్దరూ జంటంగా కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ ‘ఖుషి’. లవ్ స్టోరీలకు కేరాఫ్ గా చెప్పుకునే దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సామ్ – విజయ్ జోడీగా కలిసి నటిస్తున్నాన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి పెరిగింది.అందులోనూ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తో మంచి హిట్స్ సాధించిన విజయ్, మజిలీ తర్వాత చాలా కాలానికి సమంత ఇద్దరూ ఓ ప్రేమ కథా చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. ఇక వీరిద్దరూ ఇప్పటికే మహానటి మూవీలో కూడా కలిసి నటించడంతో వీరి తాజా చిత్రం పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటెన్స్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్-సామ్ మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కథ డిమాండ్ చేయడంతోనే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సీన్స్ క్రియేట్ చేశారని వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆ సన్నివేశాలకు ఉన్న డెప్త్‌ను అర్థం చేసుకున్న విజయ్-సమంత లిప్‌లాక్ సీన్లలో నటించేందుకు ఒప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీంతో ఈ చిత్రం కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా, అందులో విజయ్ స్టైలిష్‌గా , సామ్ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా కనిపించారు.ఇక ఆ పోస్టర్ కి మంచి స్పందనే లభిస్తోంది.
మరీ నిజంగా ఈ సినిమాలో సామ్ – విజయ్ ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది వేచి చూడాల్సిందే.