IT Companies Called Their Staff Back To Office :
వ్యాక్సిన్ తీసుకున్నారనే ధైర్యమో.. కరోనా ఏమి చేయలేదని ధీమానో.. ఐటీ కంపెనీలు అప్పుడే ఆఫీసులకు రమ్మంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోనేలేదు, ధర్డ్ వేవ్ ముప్పు త్వరలో ఉంటుందని తెలిసినా ఐటీ కంపెనీలు ఆఫీసులకు పిలవడం ఉద్యోగులను షాక్ గురిచేస్తోంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం వీడి ఆఫీసు వర్క్ కు సిద్ధంకావాలని సూచనలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ తరపు నుంచి ఓ నోటీస్ కూడా ఉద్యోగులకు పంపింది. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాదు.. టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు సైతం వర్క్ ఫ్రం ఆఫీసుకు మొగ్గుచూపుతోంది. ఇన్నాళ్లు హాయిగా ఇంట్లో డ్యూటీలు చేసుకున్న ఉద్యోగులు.. ఇక ఆఫీసులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
వ్యాక్సినేషన్ పూర్తయిందా?
ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు వ్యాక్సినేషన్ పై ఫోకస్ చేస్తున్నాయి. తమ కంపెనీలు ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారా.. లేదా.. ఆరా తీస్తున్నాయి. ఒకవేళ మొదటి డోసు తీసుకుంటే.. రెండో డోసు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ ఇంకా సమసిపోలేదు కాబట్టి.. అందుకు తగ్గట్టుగా ఆఫీసులను, ఉద్యోగుల గదులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతోంది. అయితే చాలామంది టీం లీడర్లు ఆఫీస్ వర్క్ అయితేనే సమర్థవంతంగా పనిచేసుకోవచ్చని సూచించడంతో ఐటీ కంపెనీలు మళ్లీ ఆఫీస్ వర్క్ కు సిద్దమవుతున్నాయి.
ఉద్యోగాలకు పిలుపు
ఇన్నాళ్లు కొవిడ్ కారణంగా కళాశాలలు మూతపడ్డాయి. చాలామంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్ లైన్ లో పాఠాలు విన్నారు. రెండేళ్లుగా క్యాంపస్ ప్లేస్ మెంట్ ఎక్కడా జరగలేదని చెప్పాలి. కరోనా క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఇన్ఫోసిస్, విప్రోలాంటి కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. మానవ వనరుల అవసరాలు పెరగడంతో మళ్లీ ఇంటర్వ్యూలకు పిలుపునిస్తున్నాయి. దీంతో మళ్లీ ఐటీలో సందడి మొదలుకానుంది. విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకోనున్నారు.
Must Read ;- తగ్గేది లే!.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా!