చంద్రబాబుకి ఐవైఆర్ కృష్ణారావు ప్రశంస….!!
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందరికి సమన్యాయం చేస్తాడని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ పదవైనా సరే అన్ని సామజిక వర్గాలకి సమానంగా పదవులు దక్కేవి. ఏ ఒక్క సామాజిక వర్గానికి కొమ్ము కాసేవారు కాదు. పార్టీలో అందరు సమానులుగానే ఉంటారు. అంతేగాని, ఒకరు ఎక్కువ, ఇంకో సామజిక వర్గం తక్కువ చేసి చూడటం నేనెప్పుడూ చూడ లేదు అని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో అన్ని పదవులు కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి. వైసీపీ ఎక్కడ కూడా సమన్యాయం పాటించడం లేదు అని అర్ధమవుతుంది. ప్రభుత్వం సలహాదారు నుండి టీటీడీ బోర్డు ఛైర్మెన్ వరకు చూసుకుంటే ఈ విషయం ఇట్టే అర్ధం అవుతుంది. జగన్, రెడ్డి సామజిక వర్గం మీద చూపిస్తున్న ప్రేమ మిగతా వర్గాల మీద కూడా చూపించాలని ఐవైఆర్ కృష్ణారావు హితవు పలికాడు.
అన్ని సామజిక వర్గాలని ఒక తాటిపై నడిపించగల ఘనుడు ఒక్క చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు పాలన సామాజిక వర్గం అని చూడకుండా, పార్టీకి కావాల్సిన అన్ని అర్హతలు అలాగే ప్రజలకి సేవ చేసే దృక్పతం ఉందా లేదా అని ఈ అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే వాడు. చంద్రబాబు ముందు, సీఎం జగన్ పిల్ల కాకి అని చమత్కరించాడు. అదే సమయంలో చంద్రబాబు చేసిన మంచి పనులగురించి ప్రశంసలు కురిపించాడు.
వచ్చే ఎలెక్షన్ లో టీడీపీ గెలుపు తథ్యము అని, అలాగే వైసీపీ ఓటమని ఎవ్వరు ఆపలేరని కూడా అయన ఖరాకండిగా చెప్పాడు. వైసీపీ మీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత దృశ్య ఆయన ఈ మాట అన్నారు అని తెలుస్తోంది. ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు నాయుడిని ప్రశంసించడం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అవుతోంది.