స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవల ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. సికింద్రాబాద్ సమీపంలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రంప చోడవరంలో కొన్ని రోజులు షూటింగ్ చేయనున్నారు. దీంతో పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అనసూయ ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది.
గురువారం అనసూయ పుష్ప షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ.. పుష్ప లోకేషన్ పిక్ ని అభిమానులతో పంచుకుంది. బ్యాక్ టు వర్క్.. పుష్ప అని పోస్ట్ చేసింది. రంగస్థలం చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్రని అంత త్వరగా మరిచిపోలేం. రంగస్థలం చిత్రంలో అనసూయ రోల్ చాలా కీలకంగా నిలిచింది అనే విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్ చేస్తోందని తెలిసింది. అయితే.. ఏ క్యారెక్టర్ చేస్తోందన్నదన్నది తెలియాల్సి ఉంది. పుష్పలో కూడా సుకుమార్ అనసూయకు పవర్ ఫుల్ పాత్రే ఇచ్చి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అభిమానులు ఎప్పుడెప్పుడు పుష్ప విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు కానీ.. షూటింగ్ కి బ్రేక్ పడడం వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం చివరిలో పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
Must Read ;- అలాంటి డ్రెస్ వేసుకుంటే.. తప్పేంటి.? : అనసూయ