మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఆరెంజ్’ సినిమాతో ఆర్ధికంగా భారీ నష్టాలు చవిచూసినప్పుడు ఆయన్ని ఆదుకుంది ‘జబర్దస్త్’. బుల్లితెర పై అదో సంచలనం. ఈ షో వలన ఎందరో బుల్లితెర నటీనటుల జీవితాల్లో వెలుగు వచ్చింది. ముఖ్యంగా నాగబాబుకు మంచి పేరు తీసుకురావడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన్ని ఆదుకుంది. ఈ షో వారాలు కాదు.. నెలలు కాదు.. కొన్ని సంవత్సరాలు నుంచి సక్సస్ ఫుల్ గా నడుస్తూనే ఉంది.
అయితే.. ఏమైందో ఏమో కానీ.. నాగబాబు ఈ షో నుంచి బయటకు వచ్చేయడం.. ఆతర్వాత మరో టీవీ చానల్ కోసం ‘అదిరింది’ అనే షో స్టార్ట్ చేయడం.. దీనికి నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తుండడం జరిగింది. ఈ షో ఫరవాలేదు అనిపించింది కానీ.. ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ‘జబర్థస్త్’ లో నాగబాబు ప్లేస్ లో సింగర్ మనో జడ్జీగా వచ్చారు. ఆయన జబర్థస్త్ నుంచి జెండా ఎత్తేయనున్నారని తెలిసింది.
విషయం ఏంటంటే.. మనోకు మరో షో కన్ ఫర్మ్ అయ్యిందట. అందుకే ‘జబర్థస్త్’ నుంచి తప్పుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. నాగబాబు ‘జబర్థస్త్’ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ‘జబర్థస్త్’ లో కీలక సభ్యుడైన గెటప్ శీను ఇటీవల స్పందిస్తూ.. నాగబాబు జబర్థస్త్ షో నుంచి తప్పుకోవడం అనేది ఆయన వ్యక్తిగతం. అయితే.. ఆయన లోటు స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలో నాగబాబు గారు జబర్థస్త్ షోలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాడు. గెటప్ శీను మాటలను బట్టి జబర్థస్త్ లో నాగబాబు రీ ఎంట్రీ కన్ ఫర్మ్ అని తెలిస్తోంది. కాకపోతే.. నాగబాబు రీ ఎంట్రీకి ముహుర్తం ఎప్పుడో తెలియాల్సివుంది.
Must Read ;- తన భార్య పద్మజ గురించి చెపుతూ ఎమోషనల్ అయిన నాగబాబు