నీ నయవంచనకో .. నమస్కారం!
ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల సమస్యలంటే జగన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టదు. ఆఫ్ట్రాల్ ఉద్యోగులే కదా ..ప్రభుత్వంలో భాగమే కదా .. చెప్పిందానికి తల ఊపుతారని భావించి ఉండి ఉండవచ్చు. కడుపుకాలీ .. ఒక్కసారిగా ఉద్యోగుల గుండె మంటలు ప్రజ్వరిల్లితే ఆ దావానలంలో ప్రభుత్వాలు తలక్రిందులు కాకతప్పదన్న సందర్భాలు అనేకం చూశాం. ‘పెన్ డౌన్’ రూపంలో తీవ్ర అసంతృప్తి పుట్టుకొస్తే దానికి ప్రభుత్వ వ్యవస్థలు స్తంభిస్తాయని తెలియదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలపై వస్తున్న ఒత్తిడి ఏపాటిదో ప్రభుత్వానికి తెలియనిది కాదు. పదవీకి సహకరించారని అధికారపార్టీకి విశ్వాసం చూపిస్తే ఉద్యోగ నాయకులు చరిత్రహీనులు అవుతారని కూడా ఎన్నికాబడిన ఆ నేతలకు తెలుసు. కత్తిమీదసాముల వారి హోదాలను కాపాడుకుంటూ .. రాష్ట్రంలోని ఉద్యోగులను పట్టుకొస్తున్నారు జేఏసీ నేతలు. అనాదిగా ఉద్యోగుల చిరకాల వాంఛ పీఆర్సీ (వేతన సవరణ సంఘం ). దీనిపై ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో జగన్ రెడ్డి ఖర్చేముందిలేనని పీఆర్సీ అమలు చేస్తానని ఒక ఉచిత హామీ పడేశాడు. ‘అన్నా .. పీఆర్సీ అనేది చాలా చిన్న విషయం .. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలో చేయిస్తా .. ప్రతి ప్రభుత్వ ఉద్యోగుడికి మాటిస్తున్నా .. పీఆర్సీ ఇచ్చే బాధ్యత నాది.. నాది!’ అని హామీలు గుప్పించారు. తరువాత ఓట్లు పొగుచేసుకుని గద్దెనెక్కాడు. ఆ తరువాత ఉద్యోలకు ఇచ్చిన హామీ మరిచాడు. వారి సమస్యలను గాలికొదిలేశాడు. ఉద్యోగ సంఘాల పెద్ద తలకాయలు ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వచ్చినప్పుడల్లా .. వారం .. వారం అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. వారం పోయి ఈ మాసంతో హామీ అమలకు 126 వారాలు గడిచిపోయాయి.
ఇంతటి పరాభావమా.. సిగ్గుతో తలదించుకున్న ఉద్యోగ సంఘాలు!
ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల పోయిన నెల 13న తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల పెద్దలకు హామీఇచ్చారు. దీని కొరకు నివేదిక తయారుచేస్తున్నామని, వారం రోజుల్లో నివేదికను ప్రకటిస్తామని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు 28 రోజులు గడుస్తున్న ఈరోజు, రేపు అంటూ విషయాన్ని దాటవేస్తున్నారే తప్పా .. పీఆర్సీ అమలు చేసే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే బుధవారం పీఆర్సీ నివేదిక ఇవ్వాలని సచివాలయం వద్ద ఉద్యోగ సంఘాల నేతలు పట్టుపట్టారు. నివేదికిస్తామని సచివాలయానికి పిలిచి పరాభవించారని అవేదన వ్యక్తం చేశారు. నివేదిక కోసం సచివాలయం ఆవరణలోనే రాత్రి 9.20 గంటల వరకు బైటాయించి ఎదురు చూసినా ..ఒక్కరూ స్పందించలేదు. పదేపదే ఫోన్లు చేసినా సీఎస్ నుంచి సీఎం వరకు ఎటువంటి స్పందనలేదని ఉద్యోగ సంఘాల జేఎసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు అవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ ( వేతన సవరణ సంఘం ) నివేదిక బయటపెట్టకుండా దాచేంతగా అందులో ఏముంది అని ప్రశ్నించారు.
ఆశల పల్లకిలో ఊరేగిస్తున్న ‘వారం .. వారం’
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి వాడిన పదాన్నే నేడు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ వాడతున్నారు. ‘వారం .. వారం .. వారం!’అని. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ పదాన్ని 125 వారాల నుంచి వాడుతునే ఉన్నారు. పీఆర్సీ అమలు వారం రోజులు గడువు అని చెప్పి, సంవత్సరాలు తరబడి వేచిచూసేలా చేస్తే ఎలా అని ఉద్యోగులు జేఏసీ నేతలను నిలదీస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనలను చల్లర్చేందకు సజ్జల వారంలో నివేదిక ప్రకారం పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. అలానే హెల్త్ కార్డులు, హెల్త్ ఫీజుల రీయింబర్స్ మెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామి ఇచ్చారు. గత నెల 29 న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. పీఆర్సీ నివేదికను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడ్డాయి. వారం రోజుల్లో మీ ఆశల నివేదిక అందిస్తామని ఆయన కూడా హామీ ఇచ్చారు. వారం తరువాత నిన్న సచివాలయానికి వచ్చి .. సీఎస్ ను కలిస్తే వెళ్లి సాధారణ పరిపాలన శాక ( జీఏడీ ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలవాలని చెప్పారు. శశిభూషణ్ అందుబాటులేక పోతే .. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలేదు. పదే పదే కాల్ చేసినా ఆన్సర్ చేయలేదని నేతలు వాపోయ్యరు. రాత్రి 9.20 గంటల వరకు ఎదురు చూసి వెనుదిరిగారు జేఏసీ నేతలు. ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్మెంట్ అనేవి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు. తమ సమస్యలను జగన్ ప్రభుత్వం పరిష్కారం చూపుతాయని ఆశలు పెట్టుకున్నప్పటికీ రిక్త హస్తాలు ఇలా పరాభవిస్తాయని ఉద్యోగులు కూడా ఊహించి ఉండరు.