తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై కేసుల పరంపరను కొనసాగిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ కేసుల ఇంపాక్ట్ మొత్తం టీడీపీకి అనుకూలంగా మారుతోంది.
ఏపీలో విచిత్రం.., విడ్డూరం.., వైవిధ్యభరిత రాజకీయాలకు జగన్ రెడ్డి తెరతీస్తున్నారు. అధికార వేషంలో ఉన్న ఒక దొంగ.. భావితరాల సొత్తును కాజేసి.. తప్పించుకునే క్రమంలో పక్కనున్న వారిని చూసి దొంగా..దొంగా.. అని ఆరుస్తాడంట. ఎందుకంటే ఆ దొంగ వేషం తొలగిన వేళ.. ఆ మాత్రం నటించక తప్పదుగా. ఈ సామెత సరిగ్గా జగన్ రెడ్డి అండ్ కో కు సరిపోతోంది. జనాన్ని ఏమార్చడంలో పీహెచ్డీ తీసుకున్న జగన్.. గజకర్ణ..గోకర్ణ.. టక్కు టమారా విద్యలన్నీంటిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న రాజకీయం…, పరిణామక్రమంలో పొడుస్తున్న అక్రమ కేసులు. కట్ చేస్తే.. చంద్రబాబుతో పాటు అప్పుడు ఆయనతోపాటు పనిచేసి మాజీ మంత్రులపై సైతం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అక్రమ కేసులతో రగులుతున్న ఏపీ రాజకీయాలపై తెలుగు దేశం పార్టీలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి.
ఇప్పటికే చంద్రబాబుపై 6 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన మద్యం, ఇసుక కేసుల్లో మాజీ మంత్రులపై కొల్లు రవీంద్ర, పీతల సుజాత లను అరెస్ట్ చేసేందుకు వ్యూహ రచన జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్ని కేసులు పెట్టినా.. చివరికి న్యాయస్ధానంలో న్యాయమే గెలుస్తోందని దీక్షాదక్షతతో చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతలు భీష్మించారు. ఈ క్రమంలో చంద్రబాబు.., టీడీపీ నేతలపై నమోదు అవుతున్న వరుస కేసుల నేపధ్యంలో తాజా సోషల్ మీడియాలో ట్రోల్స్ పెద్దఎత్తున షురూ చేశారు న్యూట్రల్ నెటిజన్లు. చంద్రబాబు పై మరో వందల కేసులు పెట్టాలని.. అలా పెడితేనే చంద్రబాబు గొప్పతనం ప్రజలకు .., ముఖ్యంగా ఎదుగుతున్న యువతకు బాగా తెలిస్తోందని కామెంట్లు రూపంలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు భవితరాలకు విజనరిగా పేరున్న చంద్రబాబు చేసిన మంచి పనులు, అభివృద్ధి వంటివి ఈ అక్రమ కేసుల ద్వారా పాజిటివ్ రిఫ్లాక్షన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫోకస్ అవుతున్నాయి. ఇలా ఆనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన మంచి స్కిల్ కేసులో బహిర్గతమైంది. అలానే స్కిల్ కేసు తరువాత నమోదైనా.., అవుతున్న కేసులు ద్వారా ఆనాడు ఏపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం, అన్నీ రంగాల సర్వతోముఖ అభివృద్ధి నేడు ప్రజల కళ్ళకు కడుతోంది.
ఇలా స్కిల్, అంగళ్ళు, ఫైబర్ గ్రిడ్, ఇన్నరింగ్ రోడ్డు అలైన్మెంట్, మద్యం, ఇసుక వంటి పథకాల్లో కుంభకోణాలు జరిగాయని అభియోగాలపై నమోదు చేసిన కేసులు తెలుగుదేశానికి ఫ్లస్ అవుతున్నాయి. ఈ కేసులతో ఇందులో జరిగిన అభివృద్ధి.., సాధించిన సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లెక్కలు బయటకొస్తున్నాయి. అదే ఈ కేసులు నమోదు చేయకుంటే ఇవన్నీ భయటకు రావు.. కాగితాలకే పరిమితం అయ్యేవి. జగన్ పెడుతున్న అక్రమ కేసుల పుణ్యమాంటూ.. నేడు చంద్రబాబు గొప్పతనం, దార్శినికత, ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధత రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, యువతకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో నూట్రల్ నెటిజన్లు.. చంద్రబాబు పై కేసుల పరంపర అస్త్రాన్ని వదలి.. ఆయనకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని కామెంట్లు పెడుతున్నారు. అక్రమ కేసులపై విశ్లేషణ లేకపోలేదు.