November 8, 2026 7:24 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ తాజా నిర్ణయం : తండ్రి ఆశయానికి తూట్లు!

సేద్యం చేసే ప్రతివాడికి కరెంటు ఉచితంగా ఇవ్వాలని వైఎస్సార్ అనుకున్నారు. ఇప్పుడు మీటర్లు బిగించి లెక్కతీసి, ఆ బిల్లుల సొమ్ము వారి ఖాతాల్లో వేయడం అంటే.. ప్రస్తుత లబ్ధిదారుల్లో ఏ కొందరికి కోత పడినా.. తండ్రి ఆశయానికి తనయుడు జగన్ తూట్లు పొడిచినట్టే కదా!

September 2, 2020 at 7:14 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన రోజున ప్రజలకు తెలిసివచ్చేలాగా… ఆయన కొడుకు జగన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆయనను ముఖ్యమంత్రిని చేసిన ఆ స్వప్నం కూడా- ఈ నిర్ణయం కారణంగా నెమ్మదిగా చచ్చిపోతుందా?

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేసే విద్యుత్ కు బిల్లులు మేం రైతుల ఖాతాలో జమ చేస్తాం. రైతులు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 2004 నుంచి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రభుత్వమే లెక్కగట్టి  విద్యుత్ పంపిణీ సంస్థలకు బిల్లులు చెల్లిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటి? ప్రభుత్వ నిర్ణయం రైతులకు మేలు చేస్తుందా? రైతుల్లో ఆందోళన ఎందుకు మొదలైందో ఒక్కసారి పరిశీలిద్దాం…

ఏపీలో మొత్తం 18 లక్షల పంపుసెట్లు ఉన్నాయిని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందుకుగాను ఏటా ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.8,400 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అంటే సగటున  ఒక్కో మోటారుకురూ.50000 చెల్లిస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో రైతులు ఎంత విద్యుత్ వాడారో తెలుసుకునే విధానం లేదు. రాండమ్ గా జిల్లాలో ఎక్కడో ఒక ట్రాన్సుఫార్మర్ వద్ద మీటరు బిగించి దాన్నే జిల్లా మొత్తానికి వర్తింప జేస్తున్నారు. 

ఇది ఖచ్ఛితమైన విధానం కాదు. దీని వల్ల ఏటా విద్యుత్ సంస్థలు మాకు నష్టం వాటిల్లుతోందని గగ్గోలు పెడుతున్నాయి. వ్యవసాయరంగానికి చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఒక్క ఏపీలోనే విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.20000 కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రతి పంపు సెట్టుకు స్మార్ట్ మీటర్ బిగించాల్సి ఉంటుంది. 

స్మార్ట్ మీటర్ ఏర్పాటు సాధ్యమా?

రాష్ట్రంలో ఉన్న 18 లక్షల మోటార్లకు ముందుగా స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ నెల నుంచి ఏదో జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రం మొత్తం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొలాల్లో ఎక్కడెక్కడో విసిరేసినట్టు ఉండే మోటార్లకు మీటర్లు బిగించడం ఒక ఎత్తయితే… వాటి నుంచి ప్రతి నెలా రీడింగ్ తీసుకోవడం కూడా కష్టమే. గత ప్రభుత్వంలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనే నిర్ణయం పెద్ద దుమారాన్నే రేపింది. మీటర్లు బిగిస్తే ఇక భారీగా బిల్లులు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం భారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రైతాంగం చర్చించుకుంటున్నారు. ఉచిత విద్యుత్ భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. తెల్లరేషన్ కార్డు లేని రైతులను, ఆదాయపన్ను చెల్లిస్తున్నవారిని, కారు ఉన్న రైతులను, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఉంటే వారికి ఉచిత విద్యుత్ సేవలు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

రైతులెందుకు వ్యతిరేకిస్తున్నారంటే?

నందమూరి తారకరామారవు పార్టీ పెట్టిన కొత్తల్లో  వ్యవసాయానికి హార్స్ పవర్ కు రూ.50 మాత్రమే అంటూ ప్రచారం చేయడంతో రైతులు చాలా ఆనందించారు. ఎంత విద్యుత్ వాడుకున్నా రైతులు రూ.250 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే. ఒక్కోసారి రైతులు ఆ మొత్తం కూడా చెల్లించే స్థోమత ఉండేది కాదు. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లే అందుకు కారణం. ఆ తరవాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వచ్చాక విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు మొదలయ్యాయి.

ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్ కు లెక్క పక్కాగా ఉండాలని ఆయన భావించారు. వ్యవసాయ విద్యుత్ ఛార్జీలు కూడా భారీగా పెంచారు. కొందరు రైతుల మోటార్లకు మీటర్లు కూడా బిగించారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఒక్కో రైతు తాము వాడుకున్న విద్యుత్‌కు బిల్లు చెల్లించాలంటే ఏటా రూ.50000 నుంచి రూ. 100000 దాకా చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు సాధ్యంకాని పని. అందుకే వ్యవసాయ పంపుసెట్టుకు మీటర్లు బిగిస్తున్నారంటేనే రైతులు పలు విధాలుగా ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నారు.

అప్పులు తెచ్చేందుకేనా?

విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుతం నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు కూడా మీటర్లు బిగించి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం లెక్క పక్కాగా ఉంటే  భారీగా అప్పు పుట్టే అవకావం ఉంది. కేంద్రం తాజాగా విద్యుత్ రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలు కూడా ఇవే చెబుతున్నాయి. అందుకే  ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలు భారీగా అప్పులు తెచ్చుకుని వారి కార్యకలాపాలు విస్తరించుకోవాలంటే ప్రభుత్వం వారికి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈ కొత్త సంస్కరణలకు నాంది పలికారని తెలుస్తోంది.

10000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసమేనా ఇదంతా?

కడప జిల్లాలో రూ.50000 కోట్ల అంచనా వ్యయంతో 10000 మెగావాట్ల సోలార్ ప్లాంటు నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు విద్యుత్ సంస్థలకు రుణాలు కావాలంటే సంస్కరణలు తప్పనిసరి. అందుకే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్ విద్యుత్‌కు లెక్క తీయాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాయి. ఇందులో భాగంగానే వ్యవసాయ పంపుసెట్లకు రాబోయే నాలుగైదు నెలల్లోనే స్మార్ట్ మీటర్ల బిగించే అవకాశం ఉంది. 

రైతులు ఆందోళన చెందకుండా ముందుగా రైతుల ప్రత్యేక ఖాతాలో సొమ్ము జమ చేస్తామని, ఆ డబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లిస్తే సరిపోతుందని చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించిన దాఖలాలు లేవు. అంతటా ర్యాండమ్ రీడింగ్ తీస్తున్నారు. తాజాగా ఏపీలో తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు వ్యవహారం భవిష్యత్ లో ఎటు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.

 

Tags: free powerjaganmohan reddyleotopys rajasekhar reddy
Previous Post

‘లెఫ్ట్’ అనగా వదిలివేయుట.. కొత్త నిరూపణ

Next Post

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

Related Posts

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

100 పాటలు, గళాలతో బాలు పాటల సుస్వరార్చన

ముఖ్య కథనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist