ఆవేశంతో అడుగు వేస్తే ఆలోచన కూడా వెనక్కు పోతుంది.. అదే ఆలోచనతో అడుగు వేస్తే.. ఆవేశం పర్‌ఫెక్టుగా పని చేస్తుంది. ఆలోచనకు, ఆవేశానికి కాంబినేషన్ కరెక్టుగా కుదిరితే రిజల్ట్ అదిరిపోద్ది. బ్యాలెన్స్ తప్పితే.. రివర్స్ స్ట్రోక్ తగులుద్ది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాత నుంచి ఆవేశాన్ని అందుకున్నాడే గాని.. తండ్రి నుంచి ఆలోచనను తెచ్చుకోలేకపోయాడు. అందుకే తొక్కుతున్నా అనుకుని బలంగా అడుగులు వేస్తున్నాడే గాని.. ఎప్పుడు తొక్కుతున్నా.. ఎక్కడ తొక్కుతున్నాడో చూసుకోవటం లేదు.
టీడీపీకీ మేలు చేసినట్లేనే..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశంలో నిరాశ కనపడింది. చంద్రబాబు అంతగా మోటివేట్ చేసినా పని కాలేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తప్పితే వేరే ఎన్నికలు ఇక లేవు. అప్పటి వరకు సైలెంటుగా ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితిలోకి చంద్రబాబు నెట్టివేయబడ్డారు. ఇక ఏం చేయాలి అని మదనపడుతున్న వేళ.. జగన్మోహన్‌రెడ్డి ఒక అస్త్రాన్ని అందించాడు. అదే రాజధాని భూముల కేసు. అవును.. ఈ కేసు కనక లేకపోతే.. చంద్రబాబుకు వేరే యాక్టివిటీ టేకప్ చేయడానికి చాలా టైమ్ పట్టేది. ఇప్పుడు తెలుగుదేశం కేడర్ సైతం.. తమ ఓటమిని మర్చిపోయి.. అధినేత కేసు, అరెస్టుల చుట్టూనే తిరుగుతారు. ఇది టీడీపీకీ మేలు చేసినట్లే.
Must Read ;- జగన్ మరింత స్పీడు అవుతారా.. మున్ముందు మరింత దారుణం?
చంద్రబాబుపై దెబ్బ వేయాలని..
కాని వైసీపీ అలా అనుకోవడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయి.. నిరాశలో ఉన్న టైమ్‌లోనే చంద్రబాబుపై దెబ్బ వేయాలని.. అప్పుడు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మరింత జావగారిపోతారని అంచనా వేస్తున్నారు. కాని ఫలితాలొచ్చిన రెండోరోజే సీఐడీ నోటీసులిచ్చాక.. రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆ కేసు సరైనదా కాదా.. పగతో పెట్టిందా.. చంద్రబాబును అరెస్ట్ చేస్తారా.. జైలుకు పంపుతారా.. అదే జగన్ లక్ష్యమా అంటూ జనంలో చర్చ నడుస్తోంది.
సంక్షేమ పథకాలపైనే ఆధారం
మొదటి నుంచి జగన్మోహన్‌రెడ్డి ఇలాంటి తప్పులే చేస్తున్నాడు. అమరావతిని మూడు రాజధానుల పేరుతో కెలికి.. తెలుగుదేశానికి ఉద్యమం చేసే అవకాశమిచ్చాడు. ఇసుక పాలసీతో ప్రతిపక్షాలకు ఊపిరి ఇచ్చాడు. కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడి రాష్ట్ర అభివృద్ధి సంగతి పక్కనపెట్టాడు. ఆ పథకాలే ఓట్లు తెచ్చిపెడతాయన్న అంచనా పని చేసింది ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో. కాబట్టి ఇక అదే రూట్‌లో కంటిన్యూ అయిపోతాడు.
లోకేష్‌పై కేసుకు ప్లాన్..?
వరుస తప్పులు చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి లోకేష్‌పై కేసుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే లోకేష్ కెరీర్‌కు అదే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు లోకేష్ తెలుగుదేశంలో లీడర్‌గా ఎదిగాడే గాని..రాష్ట్రానికి కాదు. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి.. ఇప్పుడు మంచి స్కోప్ ఉంది. అయితే లోకేష్ కెరీర్‌ను ఎదిగేలా చేయడానికి జగనే ఓ షార్ట్ కట్ అందిస్తాడని సమాచారం. ఏదో ఒక కేసు వెతికి పెట్టించి… లోకేష్‌ను కూడా విచారణ, అరెస్ట్ అంటూ హంగామా చేసి సాటిస్‌ఫై అవ్వాలని జగన్ చూస్తున్నాడు.. కాని అదే లోకేష్‌కు తీరిక లేని విధంగా పొలిటికల్ యాక్టివిటీని అందించడం ఖాయం.
Must Read ;- సిల్లీ కేసులతో చంద్రబాబును భయపెట్టలేరు : టీడీపీ నాయకులు